Nithiin releases sneak peek of ‘Maestro’ నితిన్ ‘మాస్ట్రో’ నుంచి ఫాన్స్ కు కృష్ణాష్టమి సెష్పల్

Maestro sneak peek nithiin a blind piano player

Nithin, Maestro, Sneak Peek, Nithiin, Tamannah Bhatia, Nabha Natesh, Jissu Sen Gupta, Merlapaka Gandhi, Mahathi Swara Sagar, N.Sudhakar Reddy, Nikitha Reddy tollywood, Entertainment, Movies

Nithiin and the team of upcoming thriller drama Maestro are busy in the promotional activities of the film, which is gearing for the release soon. Maestro is the Telugu remake of Hindi film Andhadhun. Nabha Natesh is playing the love interest of Nithiin whereas milky siren Tamannah Bhatia is playing the crucial role and her character has negative shades

నితిన్ ‘మాస్ట్రో’ నుంచి ఫాన్స్ కు కృష్ణాష్టమి సెష్పల్

Posted: 08/30/2021 03:23 PM IST
Maestro sneak peek nithiin a blind piano player

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ కు ప్రస్తుతం హిట్ చాలా అవసరం. భీష్మ తరువాత పెద్దగా హిట్ లేకపోవడంతో ఆయన తనకు చక్కటి హిట్ అవసరమని దానిని.. మేర్లపాక గాంధీ అందించనున్నారని నమ్మతున్నాడు. ఎందుకంటే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపోందుతున్న 'మాస్ట్రో' సినిమా త్వరలో విడుదలకు సిద్దమైంది. నికితా రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, కొంతకాలం క్రితం హిందీలో హిట్ కొట్టిన 'అంధదూన్'కి రీమేక్. నితిన్ జోడీగా నభా నటేశ్ నటించిన ఈ సినిమాలో, తమన్నా ప్రతినాయిక లక్షణాలతో కూడిన ఒక కీలకమైన పాత్రను పోషించింది.

ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'స్నీక్ పీక్'ను రిలీజ్ చేశారు. నితిన్ పియానో ప్లే చేస్తూ ఉండగా, అది రిపేర్ కి రావడం .. ఆయన అసహనానికి లోను కావడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఒక మర్డర్ కేసు చుట్టూ తిరిగే ఈ కథలో నితిన్ అంధుడిగా కనిపించనున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని నితిన్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles