KGF Chapter 2 Satellite Rights: To Stream On ZEE! కేజీఎఫ్ 2: శాటిలైట్ రైట్స్ ఎగురేసుకుపోయిన జీ సంస్థ‌..!

Kgf chapter 2 south satellite rights sold for a record price to zee

KGF Chapter 2, ZEE, KGF Chapter 2 release, Yash, Sanjay Dutt, Raveena Tandon, South India Satillite Rights, Tollywood, Mollywood, Sandalwood, Kollywood, movies, Entertainment

The KGF Chapter 1 film was a huge success when it released. The film’s production house, Hombale Films, recently announced their collaboration with South-based ZEE channels for the release of the much-awaited sequel, KGF Chapter 2.

కేజీఎఫ్ 2: శాటిలైట్ రైట్స్ ఎగురేసుకుపోయిన జీ సంస్థ‌..!

Posted: 08/20/2021 07:23 PM IST
Kgf chapter 2 south satellite rights sold for a record price to zee

కేజీఎఫ్ సిక్వెల్ గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2 సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉండ‌గా, ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా కేజీఎఫ్ 2 చిత్ర సంస్థ.. సౌత్ లాంగ్వేజెస్‌కి సంబంధించిన శాటిలైట్ రైట్స్ జీ సంస్థ‌కు అప్ప‌గించిన‌ట్టు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే శాటిలైట్ హ‌క్కుల కోసం చిత్ర నిర్మాణ సంస్థ‌కు జీ బాగానే ముట్ట‌జెప్పిన‌ట్టు తెలుస్తుంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన కేజీఎఫ్ 2 సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయింది.

ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉండగా టీజర్ విడుదలైన తరువాత ఆ అంచనాలు భారీగా పెరిగాయి. కేజీఎఫ్ ఛాప్టర్ 1తో పోల్చి చూస్తే ఆరేడు రెట్లు ఎక్కువగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. యశ్ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 కు 11 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్న యశ్ ఛాప్టర్ 2కు మాత్రం భారీ మొత్తం పారితోషికంగా అందుకున్నట్టు స‌మాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles