Jr NTR and Ram Charan's RRR making video out పంబరేపుతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో.!

Ss rajamouli reveals rrr bts video starring ram charan and jr ntr

RRR, Jr NTR, Ram Charaz, RRR making video, rrr making video new, RRR BTS video, Alluri sitaramaraju, ss rajamouli, rrr video, rrr release date, rrr October 13, alia bhatt, Rajamouli Ram charan, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Tollywood, Entertainment, movies

The making video of SS Rajamouli's RRR was dropped online on July 15 at 11 am, as promised. The video shows the director and the technical crew in action. It shows massive sets and the lead actors including Jr NTR, Ram Charan, Alia Bhatt and others, enacting their scenes. With the making video, the makers of RRR re-confirmed that the film will release in theatres on October 13.

పంబరేపుతున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో.!

Posted: 07/15/2021 11:34 AM IST
Ss rajamouli reveals rrr bts video starring ram charan and jr ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు తమ ముందుకు వస్తుందా అంటూ అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అభిమానులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి ఏ అప్ డేట్ వచ్చినా.. క్షణాల్లో అది వైరల్ అవుతోంది. దీని బట్టి ఈ చిత్రం దేశవ్యాప్త సినీఅభిమానుల్లో ఎంతటి క్రేజ్ వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

రాజమౌళి దర్శకత్వంలో రూపోందుతున్న మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం కావడంతో అభిమానుల ఆసక్తిని గమినించిన చిత్రబృందం ఇవాళ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ రూపోందిస్తున్న రాజమౌళి మార్కు దర్శకత్వంతో పాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఈ చిత్రం కోసం ఎంతగా కష్టపడ్డారో ఇట్టే అర్థమవుతోంది. వీరితో పాటు కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సహా నటీమణులు ఎంతగా శ్రమిస్తున్నారో కనబడుతోంది.

ఈ వీడియో చూస్తేంటేనే పంబరేపుతుండగా, ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ఎలా ఉంటుందో.. ఊహకు అందని అంచనాలను పెరుగుతున్నాయి. ఈ చిత్రం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చందాన తెర‌కెక్కిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. హాలీవుడ్ స్థాయిలో జక్క‌న్న స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ‌మౌళి అద‌రగొట్టారు. ఈ వీడియోని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ టీం అభిమానుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌.. అల్లూరి సీతారామ‌రాజుగా కనిపిస్తుండ‌గా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా మోరిస్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భట్ న‌టించింది. ఇక ఈ చిత్రం ఈ అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles