MAA Elections 2021: Prakash Raj on Non Local comments నాన్ లోకల్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్

Maa elections 2021 prakash raj bats for the prosperity of telugu actors

maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, jayasudha, sudigali sudheer, srikanth, prakash raj news, tollywood, movies, entertainment

After Announcing 27 names of his panel members, actor Prakash Raj on Friday said he would strive for the betterment and prosperity of all Telugu actors. The actor announced his candidature for the president’s post of the upcoming MAA (Movie Artistes Association) 2021 election.

MAA Elections 2021: నాన్ లోకల్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్ రాజ్

Posted: 06/25/2021 04:51 PM IST
Maa elections 2021 prakash raj bats for the prosperity of telugu actors

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు  ఉత్కంఠభరితంగా మారాయి. ఈ ఎన్నికలలో అధ్యక్ష బరిలోకి అకస్మాత్తుగా రాలేదని, ఏడాదిగా గ్రౌండ్‌ వర్క్‌ చేసి వచ్చామని అన్నారు. సెప్టెంబర్లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే సీనియర్‌ నటుడు ప్రకాశ్ రాజ్‌, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమ ప్రకటించారు. దీంతో మా ఎన్నికలు నాలుగుస్తంభాలాటగా మారింది. ఇక మా ఎన్నికల్లో ముందు నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌

27 మందితో తన ప్యానల్‌ సభ్యులను ప్రకటించిన ఆయన శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీనీ కార్మికల సమస్యల పరిష్కారం కోసమే తాను అధ్యక్ష బరిలోకి దిగుతున్నానని చెప్పారు. తన ఫ్యానల్లో‌ని సభ్యులంతా స్వయం కృషితో పైకి వచ్చినవారేనని చెప్పారు. సమస్యల గురించి మాట్లాడక.. లోకల్‌, నాన్‌ లోక్‌ ఇష్యూ తెరపైకి తేవడం దారుణమన్నారు. కళాకారులు ఒక ప్రాంతానికే పరిమితం కాదని... యాక్టర్లు యూనివర్సల్ అనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.

ఆ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అనే విషయాలను కూడా తెరపైకి తీసుకురావద్దని కోరారు. ఈ పరిశ్రమలో అందరూ అందరికీ కావాల్సిన వారేనని చెప్పారు. పదవి కోసం తాను పోటీ చేయడం లేదని అన్నారు. ఈ అంశంలోకి మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదని ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయపరంగా మెగా బ్రదర్ నాగబాబుతో తనకు విరోధం ఉందని... కానీ పరిశ్రమ పరంగా తామంతా ఒక్కటేనని చెప్పారు. మంచు విష్ణుకు కూడా ఫోన్ చేశానని... ఎన్నికలను అసహ్యంగా మారకుండా చూద్దామని చెప్పానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa elections 2021  prakash raj  pannel  announcement  jayasudha  sudigali sudheer  srikanth  tollywood  

Other Articles