Nagarjuna as Vijay Varma in Wild Dog వైల్డ్ డాగ్ టీజర్లో పోలీస్ అధికారిగా అక్కినేని నాగార్జున

I m not ok with that wild dog teaser starring nagarjuna akkineni

Wild Dog Teaser Promo, Akkineni Nagarjuna, Nagarjuna police officer, Nagarjuna Wild Dog, Saiyami Kher, Ahishor Solomon, Matinee Entertainment, Dia Mirza, Ali Reza, cinema news, latest movie news, movie news, tollywood, trending movie updates, Entertainment

Watch and enjoy the teaser of upcoming action thriller film Wild Dog starring Akkineni Nagarjuna and Saiyami Kher in lead roles. It is written and directed by debutant Ahishor Solomon and produced by Niranjan Reddy and Anvesh Reddy under the banner of Matinee Entertainment.

‘ఐ యామ్ నాట్ ఓకే’: వైల్డ్ డాగ్ టీజర్లో అక్కినేని నాగార్జున

Posted: 03/26/2021 07:05 PM IST
I m not ok with that wild dog teaser starring nagarjuna akkineni

అక్కినేని నాగార్జున హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ ప్రపంచవ్యాప్తం పేక్షకుల మందుకు వచ్చేనెల ఏప్రిల్ 2న రానుంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషన్ వర్క్ ను చేసుకుంటూ బిజీగా వుంది. ఇందులో భాగంగా హీరో అక్కినేని నాగార్జునతో చిత్రబృందం వరుస పెట్టి ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ గంగవ్వతో కూడా చిత్రాన్ని ప్రమోట్ చేయించారు నాగ్. తాజాగా వైల్డ్ డాగ్ మూవీ నుంచి టీజర్ ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన దేశంలో గతంలో జరిగిన టెర్రరిస్ట్ దాడుల ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్.

కమర్షియల్ పంథా పక్కనబెట్టి పక్కా దేశభక్తి సినిమాను చేసాడు నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో మన దేశంలో 1989లో అప్పటి హోం శాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సైయిద్ కూతురును టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే 19 టెర్రరిస్టులను విడిచిపెట్టారు. 1999లో కాందహార్ ప్లేన్ హైజాక్ చేసినపుడు హఫీజ్ సైయ్యద్ సహా ముగ్గరు టెర్రరిస్టులను విడిచిపెట్టారు. ఆ తర్వాత హఫీజ్ సైయ్యద్.. ముంబాయిలో టెర్రర్ అటాక్ చేయించాడు. ఈ దాడిలో 174 మంది అమాయకులు చనిపోయారు. ఎంతో మంది కాలు చేతులు విరగొట్టుకొని దివ్యాంగులయ్యారు.

దేశంలో ఎన్నో మారుణ కాండలను చేసిన టెర్రరిస్టులను మనం ఏమి చేయలేం అంటే దానికి నేను ఒకే చెప్పను అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ బాగుంది. ఈ చిత్రంలో విజయ్ వర్మగా నాగార్జున డీల్ చేసిన కేసులో ఎవరు మిగలలేదు అనే డైలాగ్ బాగుంది. టెర్రరిస్టులను పట్టుకోని వాడికి బిర్యానీలను మేపడం లాంటివి చేయకూడదనే డైలాగులు ఆలోచింపచేసేలా ఉన్నాయి. మొత్తంగా టెర్రరిస్ట్‌ల కోసమే దేశంలో 29 కోట్ల మంది పోలీసులు, సైనికులు సహా ఎంతో మంది కాపలా కాస్తున్నట్టు చూపించారు ఈ టీజర్ ప్రోమోలో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles