Singer Jayaraj Narayanan killed in road mishap in US ప్రముఖ సింగర్ జయరాజ్ నారాయణన్ దుర్మరణం

Keralite classical singer jayaraj narayanan dies in chicago road mishap

Jayaraj Narayanan, Keralite, classical singer, vehicle crash, Chicago, US, Jayaraj Narayanan wife Maya, Jayaraj Narayanan two daughters Meghna Gowri, cinema news, latest movie news, movie news, tollywood, trending movie updates, Entertainment

Jayaraj Narayanan, noted Carnatic and Hindustani vocal musician from Kerala, died in a road accident here in the United States. Details of the accident are awaited. Of late Jayaraj had conducted several classical and semiclassical concerts across the US.

ప్రముఖ సంగీత కళాకారుడు, సింగర్ జయరాజ్ నారాయణన్ దుర్మరణం

Posted: 03/26/2021 05:03 PM IST
Keralite classical singer jayaraj narayanan dies in chicago road mishap

కేరళకు చెందిన ప్రసిద్ధ కర్ణాటక, హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ అగ్రరాజ్యం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ విషయం తెలిసిన భారత శాస్త్రీయ సంగీత ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అమెరికాలో పర్యటనలో వున్న ఆయన చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణవార్తను సంగీత ప్రియులు ఇప్పటికీ జీర్ణంచుకోలేకపోతున్నారు. కాగా జయరాజ్ రోడ్డు ప్రమాదఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఆయనకు భార్య, మేఘన, గౌరీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా కర్ణాకట సంగీతంలో 14 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన జయరాజ్ నారాయణన్  శాస్త్రీయ కళాకారుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శాస్త్రీయ,భక్తిగీతాలను పాడారు.  కేరళలో పుట్టి పెరిగిన జయరాజ్ పలు ప్రపంచ వేదికలపై భారతీయ సంగీత గొప్పదనాన్ని చాటిచెప్పారు.  అమెరికాలో క్లాసికల్‌, సెమిక్లాసికల్ అనేక కన్సర్ట్‌లు నిర్వహించారు. ఈ క్రమంలో చిన్న వయస్సులోనే  పలు అవార్డులను సొంతం చేసుకున్న ఆయన చిన్న వయస్సులోనే స్వర్గస్థులు కావడం సంగీతప్రియులను దు:ఖసాగరంలో ముంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayaraj Narayanan  Keralite  classical singer  vehicle crash  Chicago  US  Maya  Meghana  Gowri  Tollywood  

Other Articles