Shocking Real look of Srinivas Avasarala బట్టబయలైన శ్రీనివాస్ అవసరాల నిజస్వరూపం..

Srinivas avasarala threats co director for revealing real charecter

avasarala srinivas bald head, avasarala srinivas bald head look, avasarala srinivas, avasarala srinivas viral video, krish jagarlamudi, srinivas avasarala, srinivas avasarala videos, srinivas avasarala video, avasaralasrinivas vs co director, avasarala srinivas latest video, avasarala srinivas batta video, avasarala srinivas fight video, avasarala srinivas movie, srinivas avasarala controversy, avasarala srinivas video, avasarala srinivas co director video

37-year-old Actor, Director, Writer, singer etc Avasarala Srinivas Real look is so shocking, he warns his co-director Mahesh if his real look goes out he would see that his co director never sustains in the industry.

బట్టబయలైన డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల నిజస్వరూపం..

Posted: 03/24/2021 05:15 PM IST
Srinivas avasarala threats co director for revealing real charecter

నటుడు, దర్శకుడు, రచయిత అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపాన్ని ఆయన కో-డైరెక్టర్ మహేశ్ బట్టబయలు చేశారు. ఫోన్ ద్వారా లైవ్ వీడియోలో తన బాధను వ్యక్తం చేసని కో-డైరెక్టర్ మహేశ్ అవసరాల శ్రీనివాస్ కు సంబంధించిన ఓ అంశాన్ని బయటపెట్టాడు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అతని దగ్గర మూడేళ్లుగా పనిచేస్తున్న కోడైరెక్టర్‌ మహేశ్‌ ఈ వీడియో బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడేళ్లుగా తనతో రాత్రింబవళ్లు గొడ్డు చాకిరీ చేయించుకుని ఇప్పుడు అకారణంగా తనను వెళ్లగొట్టాడని మహేశ్ అరోపిస్తున్నాడు.

మూడేళ్ల పయనంలో తాజాగా ఇద్దరికీ మధ్య అభిప్రాయబేధాలు పోడచూపాయి. దీంతో తనను అకారణంగా అందరిముందు తిట్టి.. దుర్భాషలాడిన అవసరాల శ్రీనివాస్ నిజస్వరూపం అందరూ చూడాలని మహేశ్ తన లైవ్ వీడియోలో పేర్కోనడం వినబడింది. అయితే నిజస్వరూపం ఏంటా అని చేస్తూ.. అవసరాల శ్రీనివాస్‌ ఒరిజినల్‌‌ ఫేస్‌ చూపించి షాకిచ్చాడు. సినిమాల్లో ఉంగరాల జట్టుతో అందంగా కనిపించే శ్రీనివాస్ కు బట్టతల ఉంది. ఈ విషయాన్ని మహేశ్‌ బహిర్గతం చేసే వరకు ఎవరికీ తెలియదు.

నూటక్క జిల్లాల అందగాడు చిత్రానికి సంబంధించి ఫోటో షూట్‌లో ఉన్న శ్రీనివాస్‌ దగ్గరకు వెళ్లి తలపై ఉన్న క్యాప్ తీయగానే అతని బాల్డ్ హెడ్ బయటపడింది. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్‌.. మహేశ్ ని బూతులు తిడుతూ.. ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అంటూ బెదిరించాడు. అయితే అందుకు మహేశ్ బదులిస్తూ.. ఫేస్ బుక్, ఇస్టాగ్రామ్, సోషల్ మీడియా, యూట్యూబ్ అన్నింట్లో పెడతా అని బిగ్గరగా అరిచి చెప్పాడు. దీంతో ఏయ్.. ఎవరైనా అపండయ్యా దాన్ని అంటూ వీడియోను అపేయాలని అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles