మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు సన్నధమవుతున్న తరుణంలో టీజర్, ట్రైయిలర్ లతో అభిమానులను కానుకలు అందిస్తున్నాయి. కాగా, చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య నుంచి మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం మినహాయించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేల్ లేకపోవడంతో మెగా ఫాన్స్ నిరాశకు గురవుతున్నారు.
ఇక సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు చిత్రాలు తమ అప్ డేట్ లతో అభిమానులను అలరించాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కు కూడా కానుకను అందించేందుకు మెగాస్టార్ రెడీ అయ్యారు. తాము లేటుగా అందించినా.. లేటెస్టుగానే ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తామని చిత్ర దర్శకుడు కొరటాల శివ అంటున్నారు. ఈ నెల 29న సాయంత్రం తమ ‘ఆచార్య’ చిత్రం నుంచి అభిమానులకు అదిరిపోయే కానుక ఇస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన టీజర్ విడుదల తేదీని తెలియజేస్తూ ఇవాళ ఓ సరికోత్త వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో నిర్మాత మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. ఇక ఇప్పటికే కొరటాల విడుదల చేసిన వీడియోలోనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేట్టుగా వుందని ప్రశంసలు వినిపిస్తున్నాయి. విడుదలకు ముందే సంచలన మ్యూజిక్ కు తెరతీసేలా చేసిన మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more