Bhojpuri actress Anupama Pathak commits suicide సినీపరిశ్రమలో మరో విషాదం.. నటి అనుపమ ఆత్మహత్య

Actress anupama pathak dies by suicide at her residence in mumbai

actress Anupama Pathak, actress suicide, Anupama Pathak suicide, Anupama Pathak live on facebook, Anupama Pathak cheating, Anupama Pathak trust, Anupama Pathak bhojpuri actress, Anupama Pathak TV actress, Anupama Pathak Dahisar, Anupama Pathak Mumbai, Anupama Pathak, facebook, live streaming, maharashtra, crime

Actress Anupama Pathak has allegedly died by suicide at her residence in Dahisar. The 40-year-old actress reportedly died by suicide on August 2. A day before her death, Anupama went live on Facebook (unverified account) where she spoke about feeling cheated and not being able to trust anyone.

సినీపరిశ్రమలో మరో విషాదం.. నటి అనుపమ ఆత్మహత్య

Posted: 08/08/2020 11:37 AM IST
Actress anupama pathak dies by suicide at her residence in mumbai

సినీ పరిశ్రమలో మరో విషాదం సంభవించింది. మరో నటి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తరుణంలో నటీనటుల వరుస ఆత్మహత్యలు సినీ పరిశ్రమతో పాటు అభిమానులను కూడా కలవర పెడుతున్నాయి. ఈ తరుణంలోనే తాజాగా భోజ్ పురి నటి అనుపమ పథాక్ (40) ముంబైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిహార్ లోని పుర్నెయాకు చెందిన అనుపమ కొంతకాలంగా దేశ అర్థిక రాజధాని నగరం ముంబైలో నివాసముంటోంది. భోజ్ పురి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు హిందీ సీరియల్స్ లోనూ నటిస్తోన్న ఈ నటి బలవన్మరణానికి పాల్పడింది.

ముంబైలో ఆమె తాను నివాసముంటున్న దాహిస్సర్ ప్రాంతంలోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తన మరణానికి ఒక్క రోజు ముందు అమె సామాజిక మాద్యమం పేస్ బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసింది. అమె ఆ వీడియోలో తాను మోసానికి గురైనట్టు, ఎవరినీ నమ్మలేమని, విశ్వసించలేమని అవేదనను వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అనుపమ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందులో అనుపమ.. తాను మోసపోయానని, ఎవ్వర్నీ నమ్మే స్థితిలో తాను లేన్నట్లు అందులో పేర్కొందని ముంబై పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసుకొన్న ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్ పూత్‌, అంతకుముందు అతని మాజీ మేనేజర్‌ దిశా షాలిన్‌ ఆత్యహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మరో టీవీ నటుడు సమీర్‌ శర్మ కూడా రెండురోజుల క్రితమే ముంబయిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా నటీనటుల వరుస ఆత్మహత్యలకు ముంబయి వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. సినీ ప్రపంచాన్ని ఇన్నాళ్లు రంగురంగుల ప్రపంచంగా చూసిన అభిమానులు.. ఇకపై తమ దృష్టిని మార్చుకునేలా వరుస ఘటనలు సంభవిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  Bhojpuri  TV Actress  Anupama Pathak  facebook  live streaming  cheating  trust  Mumbai  maharashtra  crime  

Other Articles