రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్ భారతక్కగా కనిపించనున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ‘విరాటపర్వం’ చిత్రం నుంచి ప్రియమణి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని హీరో రానా అందుకుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుగు ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారతక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినదని హీరో రానా అన్నారు. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచి విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ‘విరాటపర్వం’లో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం’ అని రానా పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రియమణికి చిత్రబృందం నుంచి శుభాకాంక్షలు అందించారు, అమె జన్మదినం సందర్భంగా అమె సహచర నటీనటులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more