హీరోయిన్ తాప్సి, గత కోన్నాళ్ల నుంచి తన ప్రేమను గోప్యంగా దాచిపెట్టింది. అయితే ఇది కేవలం అభిమానుల వద్ద, మీడియా వద్దే కాదు.. తన కుటుంబసభ్యుల వద్ద కూడా అని తెలిసింది. ఈ విషయమై ఈమద్య అమె ఓ ఇంటర్య్వూలో తన ప్రేమ గురించి విషయాలను బయటపెట్టింది. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో, తాప్సీ ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న ప్రచారానికి ఇక బ్రేక్ పడింది. తన ప్రియుడి విషయం కుటుంబ సభ్యుల వద్ద దాచలేదని, వారికి తెలుసని తాప్సి తెలిపింది.
తన వాళ్ల దగ్గర విషయాల్ని దాచడం తనకు ఇష్టం లేదని అన్నారు. తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పుకోవడం తనకెప్పుడూ గర్వంగానే ఉంటుందని అన్నారు. అదే విధంగా మంచి హెడ్లైన్ కోసం మీడియా ముందు ఆ వ్యక్తి గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని అన్నారు. అదేగనక జరిగితే నటిగా తాను ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న విలువ తగ్గిపోతుందని అది తనకు ఇష్టం లేదని తెలిపింది. అందరూ తన నటన గురించి కాకుండా.. వ్యక్తిగత జీవితం గురించి రాస్తారు, మాట్లాడుతారని కూడా అబిప్రాయపడింది.
ఇక తన జీవితంలోకి వచ్చే వ్యక్తి తన కుటుంభసభ్యులకు కూడా నచ్చలని అప్పుడే తమ ప్రేమ జీవితాంతం నిలుస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఇక అమె తల్లి నిర్మల్జీత్.. తాప్సీపై తమకు పూర్తి నమ్మకం ఉందిని.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు. తాప్సి ఇటీవల ‘థప్పడ్’ సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా ‘జన గణ మన’ అనే తమిళ ప్రాజెక్టుకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. తాప్సి తెలుగు సినిమాలతో కెరీర్ ఆరంభించినప్పటికీ.. బాలీవుడ్లోనే బ్రేక్ అందుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more