Happy birthday Sai Pallavi: A powerhouse performer విలువలకు కట్టుబడే అభినయం.. సాయి పల్లవి

Sai pallavi 4 times the actress redefined female superstar tag

Happy birthday Sai Pallavi, sai pallavi, actress, female superstar tag, sai pallavi rana, sai pallavi dagupati rana, sai pallavi virata parvam, love story, naga chaitanya, tollywood, movies, entertainment

What Sai Pallavi is today is not all about the talent but the confidence with which she brings her talent forth. Post her debut, she turned to be an overnight sensation in South India. Apart from the fact that she's an amazing dancer and actress, she is also one with strong values and beliefs.

విలువలకు కట్టుబడే అభినయం.. సాయి పల్లవి

Posted: 05/11/2020 07:59 PM IST
Sai pallavi 4 times the actress redefined female superstar tag

తన సహజమైన నటనతో.. డాన్సుతో అబాలగోపాలాన్ని అలరిస్తున్న నటి సాయిపల్లవి దక్షిణాదిలో మంచి క్రేజ్ వుంది. తన డాన్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పర్చుకుంది. ఇక చిత్రాల ఎంపికలోనూ అమె తన పాత్రకు ప్రాముఖ్యం వుంటేనే అంగీకరిస్తోందన్న విషయం తెలిసిందే. ఇక అందచెందాల ప్రదర్శనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా హద్దులలో వుంటూనే అభినయనమే కీలకమని భావించడం సాయిపల్లవి ప్రత్యేకత. ఈ కారణంగానే ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా వచ్చిన క్రేజ్ ఎక్కువ. చైతూ జోడీగా ఆమె చేసిన 'లవ్ స్టోరీ' .. రానా సరసన చేసిన 'విరాట పర్వం' విడుదలకి ముస్తాబవుతున్నాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'విరాటపర్వం' యూనిట్ సభ్యులు అమెకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్ గా నటించినట్టు తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు .. లగేజ్ తో అమరవీరుల స్థూపం దగ్గర సాయిపల్లవి ఎదురు చూస్తూ కూర్చుంది. ఈ పోస్టర్ తోనే సాయిపల్లవి పాత్ర ఎలా వుండనుందనే  అవగాహన కలుగుతోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles