South Indian Stars Mourns Rishi Kapoor's Death బాలీవుడ్ సోగ్గాడికి సౌత్ ఇండియన్ స్టార్స్ నివాళులు

Eternal romantic hero south indian stars mourns rishi kapoor s death

RishiKapoor, chiranjeevi, Pawan Kalyan, NTR, Venkatesh, Bala Krishna, Rajini kanth, kamal hassan, Mahesh Babu, south inidan cinema, bollywood

Tributes come in for the veteran Bollywood actor Rishi Kapoor who passed away at the age of 67 at a private hospital in Mumbai from all over the country, The south indian cinema stars Chiranjeevi, RajiniKanth, Kamal Hassan, NTR, Venkatesh, Mahesh Babu, BalaKrishna and many others pay their tributes.

బాలీవుడ్ సోగ్గాడికి సౌత్ ఇండియన్ స్టార్స్ నివాళులు

Posted: 04/30/2020 06:18 PM IST
Eternal romantic hero south indian stars mourns rishi kapoor s death

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్ మృతి చెందడం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విలక్షణ నటుడు ఇర్పాన్ ఖాన్ మరణించిన వార్తతో విషాదంలో మునిగిన తరుణంలోనే 24 గంటలు తిరక్కముందే మరో విషాదవార్త వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని దక్షిణాది సినీప్రముఖులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు బాలీవుడ్ రోమాంటిక్ హీరో రిషి కపూర్ కు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

      ‘‘నా ఆప్తుడు, మంచి నటుడు రిషీకపూర్‌ మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన కెరీర్‌ ఎంతో మందికి స్ఫూర్తి. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం నాకెంతో బాధగా ఉంది. రిషీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - చిరంజీవి


'హృదయం ద్రవించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నా ప్రియ మిత్రుడు రిషికపూర్' అని సినీనటుడు రజనీకాంత్ ట్వీట్ చేశారు.


    ‘‘లెజండరీ నటుడు రిషీ కపూర్‌ ఆకస్మిక మరణం ఎంతో బాధను కలిగించింది. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - పవన్‌కల్యాణ్‌

        ‘రిషీ కపూర్‌ మరణవార్త విని నా హృదయం బద్దలైంది. మన సినిమా పరిశ్రమకు పూడ్చలేని మరో లోటు. గొప్ప టాలెంట్‌ ఉన్న వ్యక్తి. ఓ నిజమైన లెజెండ్‌. రణ్‌బీర్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే రిషీ కపూర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భావిస్తున్నాను’ - మహేశ్‌బాబు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles