రెబెల్ స్టార్ ప్రభాస్ తో వివాహం జరగనుందంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. అయనా ఈ వార్తలు మళ్లీ వినపించడంతో దీనిపై మెగా డాటర్ నిహారిక కొణిదెల స్పందించారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకోనుందని కొంతకాలం క్రితం పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అలాంటిది ఏమీ లేదని.. ఇకపై ఇలాంటి వార్తలను ఫుల్ స్టాప్ పెట్టాలని చిరంజీవి ఘాటుగానే చెప్పేశారు.
అయితే ఇటీవల మళ్లీ అలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయాన్ని ఓ అభిమాని నిహారికనే మళ్లీ అడిగేశాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన నిహారిక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ‘ప్రభాస్‌ని మీరు పెళ్లి చేసుకోనున్నారా?’ అని ప్రశ్నించగా.. ‘ఆ వార్తలన్ని అవాస్తవం. ప్రభాస్‌తో పెళ్లి అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని మరోసారి కూల్ గా చెప్పిందీ మెగా డాటర్.
‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో నటిగా 2016లో కెమెరా ముందుకు వచ్చిన నిహారిక.. అదే ఏడాది ‘ఒక మనసు’ చిత్రంతో కథానాయికగా తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ఆమె ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నిహారిక అతిథి పాత్రలో మెప్పించారు. అయితే అమె నటిస్తున్న మరో చిత్రానికి అమె సోదరుడు మెగా ప్రిన్స్ కథను ఒకే చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేశాక.. కానీ అసలు విషయం తెలియదు.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more