యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన ఓ తాజా వార్త ప్రస్తుతం ట్రెండింగ్ గా మారంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారింది.
'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు వుందన్న విషయం ఇప్పటికే తెలిసింది. ఇందులో ఒక కథానాయికను బాలీవుడ్ నుంచి పరిచయం చేసే ఆలోచన చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా లభించిన అప్ డేట్ ప్రకారం ఈ చిత్రంలో తారక్ సరసన అతిలోక సుందరి నటించనున్నారని తెలుస్తోంది. నమ్మశక్యంగా లేదా కానీ ఇది నిజం.
అతిలోకసుందరి శ్రీదేవి మరణించిన తరువాత ఇలాంటి వార్తా..? అంటే అమె తరానికి అమె అతిలోక సుందరి, మరి ఈ తరానికి అమె తనయ జాన్వీ కపూర్ అతిలోక సుందరి. అంటే జాన్వీకపూర్ ఈ చిత్రంలో తారక్ సరసన హీరోయిన్ గా నటించనున్నారని సమాచారం. మరో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు. గతంలో త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ .. పూజ హెగ్డే కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more