అందం.. అభినయంతో అభిమానుల్ని కట్టిపడేసి ముద్దుగుమ్మ దీపికా పదుకొణె. ఈ భామ క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తుంటారు. ఈ క్రమంలో జిమ్ లో తీసిన ఓ వీడియో బయటికి వచ్చింది. అందులో ఆమె రోప్స్ తో కసరత్తులు చేస్తూ కనిపించారు. అంతేకాదు అక్కడ పెట్టిన లుంగి డ్యాన్స్ పాటకు తనదైన స్టైల్లో రోప్ లతో సరదాగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ట్రైనర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ‘ఛపాక్’ సినిమాతో ఇటీవల దీపిక.. యాసిడ్ బాధితురాలిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్లను రాబట్టలేకపోయింది.
యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేపోయింది. ప్రస్తుతం ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘83’లో నటిస్తున్నారు.‘వారాంతం స్ఫూర్తి.. ఫన్ ఉండటం కూడా ముఖ్యమే. దీపికకు కష్టపడేతత్వంతోపాటు సరదాగా ఉండే గుణం కూడా ఉంది. 6 గంటల వ్యాయామం ఇలా గడిచింది’ అంటూ కామెంట్ చేశారు. దీన్ని కొన్ని గంటల్లోనే 2.48 లక్షల మంది చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more