Ravi Teja Drops The Disco Raja Teaser ‘డిస్కో రాజా’గా అదరగొట్టేస్తున్న మాస్ మహారాజా..

Disco raja teaser ravi teja done with the crap

Ravi Teja, Payal Rajput, Nabha Natesh, Disco Raja Teaser, disco raja, Bobby Simha, Tollywood, movies, entertainment

After scoring a hattrick of flops at the box-office, Mass Maharaja Ravi Teja has pinned all hopes on his forthcoming film Disco Raja. Directed by Vi Anand of ‘Ekkadiki Pothavu Chinnavada’ fame, the time-travel comedy features Kollywood actor Bobby Simha as the antagonist.

‘డిస్కో రాజా’గా అదరగొట్టేస్తున్న మాస్ మహారాజా..

Posted: 12/06/2019 10:53 PM IST
Disco raja teaser ravi teja done with the crap

వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ  చిత్రాన్ని జనవరి 24న 2020లో  విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌కటించారు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. నటి నభా నటేశ్‌.. పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. కాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో రవితేజ సరికొత్తగా స్టైలిష్ గా కనిపించాడు.

ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. రవితేజ ఫ్యాన్స్ కోరుకునే విధంగా యాక్షన్ షాట్స్‌ను డిజైన్ చేశామని దర్శకుడు చెప్పారు. రవితేజ రిట్రో గెటప్‌పై షూట్ చేసిన యాక్షన్ షాట్స్‌ను టీజర్‌లో పొందుపరిచామని, ఇవి ఫ్యాన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటాయని అన్నారు. టీజర్ స్టార్టింగ్‌లో రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం అని నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు.

రవితేజ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌కి నచ్చే విధంగా ‘డిస్కోరాజా’ని సిద్ధం చేస్తున్నామన్నారు. తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషించారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Payal Rajput  Nabha Natesh  Disco Raja Teaser  disco raja  Bobby Simha  Tollywood  

Other Articles