chiranjeevi invited to 'Uyyalawada Smrtivanam' ఉయ్యాలవాడ స్మృతివనం ప్రారంభం.. చిరంజీవికి అహ్వానం.!

Chiranjeevi invited to uyyalawada smrtivanam by family members

Uyyalawada narasimha Reddy history, Uyyalawada narasimha Reddy lawn, Uyyalawada narasimha Reddy heirs, sye Raa pre-release business, Sye Raa Narasimha Reddy, Chiranjeevi, Chiru, Sye Raa theatrical rights prices, Ram charan, Sye Raa satellite rights prices, Sye Raa digital rights prices, Sye Raa audio rights prices, Sye Raa area wise rights, Sye Raa distribution rights prices, Tollywood, Entertainment, Movies

Family members or legal heirs of freedom fighter Uyyalawada Narasimha Reddy, came all the way to Megastar Chiranjeevi house to invite him for the inauguration of Smrtivanam.

ఉయ్యాలవాడ స్మృతివనం ప్రారంభం.. చిరంజీవికి అహ్వానం.!

Posted: 09/25/2019 06:43 PM IST
Chiranjeevi invited to uyyalawada smrtivanam by family members

తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో నటిస్తున్న తొలి చారిత్రక చిత్రం.. 'సైరా నరసింహారెడ్డి' చిత్రం, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు దక్షిణాధి బాషలైన తమిళ, మలయాళ, కన్నడంలో పాటు జాతీయ బాష హిందీలోనూ రూపొందిన ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ప్రేక్షకులను పలకరించనుంది, దీంతో ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ అందింది. అదేంటంటే తమ వంశాకురమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రపంచ నలుదిశలా చాటేలా చేస్తున్న చిరంజీవి కృషిని, వందల కోట్లు వెచ్చించిన మెగాపవర్ స్టార్ రాంచరణ్ సాహసాన్ని ఆయన వంశస్థులు కొనియాడారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని రూపనగుడి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి వంశస్థులు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి అభినందించారు. ‘సైరా’ సినిమా ద్వారా రేనాటి గడ్డ చరిత్రను దశదిశల నిలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఆదే సమయంలో కోవెలకుంట్లలోని జుర్రేరు, కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ స్మృతివనం ప్రారంభోత్సవానికి చిరంజీవిని వారు ఆహ్వానించారు. దీనికి చిరంజీవి సానుకూలంగా స్పందించారు. ఈ చిత్రంలో నయనతార, తమన్నా కథానాయకులు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మాత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles