Gaddalakonda Ganesh 3rd Day Collection గద్దలకొండ గణేష్ తొలి వీకెండ్ కలెన్షన్స్ ఎంత.?

Varun tej s gaddalakonda ganesh valmiki 3rd day collection

Valmiki, valmiki 3 days collections, Gaddalakonda Ganesh, Gaddalakonda Ganesh 3 days collections, Varun Tej, Harish Shanker, Jigarthanda, pooja Hedge, Atharvaa Murali, Supriya Pathak, Tanikella Bharani, Mrinalini Ravi, tollywood, movies, entertainment

Gaddalakonda Ganesh aka Valmiki did have a very successful run in the box-office collection during the first weekend. People who are in deep love with the film are wondering how much the film had made on Sunday.

గద్దలకొండ గణేష్ తొలి వీకెండ్ కలెన్షన్స్ ఎంత.?

Posted: 09/23/2019 01:27 PM IST
Varun tej s gaddalakonda ganesh valmiki 3rd day collection

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'వాల్మీకి' అలియాస్ గద్దలకొండ గణేష్ చిత్రం బాక్సాఫీసు వద్ద నిలకడగా కొనసాగుతోంది. తెలంగాణ యాసతో వరుణ్ తేజ్ నటించిన మూడో చిత్రాన్ని కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారు. తాజాగా విడుదలైన గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ సాధిస్తోంది. సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి.

పాజిటివ్ టాక్ తో విజయం వైపు నిలకడగా పరుగులెత్తుతున్న ఈ చిత్రం మొదటి పది రోజుల వ్యవధిలో సుమారుగా రూ.40 కోట్ల గ్రాస్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ముగియడంతో తొలి వీకెండ్ లో కేవలం తెలుగు రాష్ట్రాలలోనే రూ.19 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, అందులో రూ.13.4 కోట్ల షేర్ సాధించింది. యూఎస్‌లో కూడా ఈ చిత్ర వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నట్లు వస్తున్నట్లు సమాచారం.

ఇక రానున్న పది రోజలు వసూళ్లు కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తే చిత్రం బంపర్ హిట్ అవుతుంది. ఈ వసూళ్లను బట్టి ఈ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో అంచనా వేయవచ్చు. కాగా వచ్చే వారం పెద్ద సినిమాల విడుదల లేకపోవడం ఈ సినిమా వసూళ్లకు అనుకూలించే అంశం. అక్టోబరు 2న సైరా విడుదల అయ్యేవరకు గద్దలకొండ గణేష్ చిత్ర వసూళ్ల జోరు కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Valmiki  Gaddalakonda Ganesh  3 days collections  Varun Tej  pooja Hedge  Harish Shanker  tollywood  

Other Articles