Aishwarya Rai to play a VILLAIN in Mani Ratnam’s next ఆ సినిమాలో ఛాన్స్ కోసం విలన్ గా ఐశ్వర్యారాయ్

Aishwarya rai bachchan to play negative role in mani ratnam s next

Aishwarya Rai Bachchan, Mani Ratnam, Ponniyin Selvan, Aishwarya Rai Ponniyin Selvan, Aishwarya villan role, Aishwarya re-entry, Aishwarya Rai role Ponniyin Selvan, mani ratnam aishwarya rai, movies, entertainment, Kollywood

Aishwarya Rai Bachchan will be making her comeback in Tamil with Mani Ratnam's Ponniyin Selvan. The latest update is that the actress will be playing an antagonist in this film based on the literary novel of the same name.

ఆ సినిమాలో ఛాన్స్ కోసం విలన్ గా ఐశ్వర్యారాయ్

Posted: 05/16/2019 04:37 PM IST
Aishwarya rai bachchan to play negative role in mani ratnam s next

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపోందిన బాహుబలి చిత్రాలు భారతీయ సినీ చరిత్రను తిరగరాయడంతో వివిధ బాషల్లో కూడా చారిత్రక నేపథ్య చిత్రాలు రూపోందిచారు దర్శకులు. అయితే తన మార్కు దర్శకత్వానికి ఓ పేరు వున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా తాజాగా చారిత్రక నేపథ్య చిత్రాన్ని రూపోందించే పనిలో నిమగ్నమయ్యారు. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా రూపోందుతున్న ఈ హిస్టారికల్ మూవీలో నటించేందుకు ఇప్పటికే భారీ తారాగణాన్ని కూడా ఫైనల్  చేశాడు దర్శకుడు.

అయితే మణిరత్నం చిత్రాల పేరు వినగానే ఆ చిత్రంలో తనకు అవకాశం వస్తే బాగుండని పలువరు సినీకళాకారులకు అనిపించడం కూడా సహజం. అయితే ఇప్పటికే ఆయన దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించడం మాట అటుంచితే.. ఏకంగా హీరోయిన్ గా కూడా మెరిసిన అందాల అమ్మడు.. మరోసారి ఆయన దర్శకత్వంలో ఓ ముఖ్యభూమికలో కనిపించాలన్న కోరిక కలిగిందట. అమె ఎవరో కాదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంతో మళ్లి చిత్రరంగంలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని అమె భావిస్తున్నారు.

చోళ రాజుల కాలంలో నడిచే కథతో మణిరత్నం తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ కథను మణిరత్నం రూపొందించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ నటించనున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా ఓ కీలక పాత్రను పోషించబోతోంది. అందులోనూ అందాల అమ్మడుగా ఇన్నాళ్లు వెండితెరపై మెరిసిన అమె.. ఇక ఈ చారిత్రక చిత్రంలో ప్రతినాయకురాలిలా (విలన్ క్యారక్టర్) కనిపించనుంది. ఈ పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles