Nithin's Turns Producer For Nitya Menen నిర్మాతగా నితిన్.. లీడ్ రోల్ లో నిత్యా మీనన్..

Nithin again turns as producer for nithya menen film

Nithin's Turns Producer For Nitya Menen, Nithin women centric movie, Nithin viswak sen movie, Nithin, Nithya Menen, Producer, Viswak Sen, 'Falaknuma Das', women-centric film, , movies, entertainment, tollywood

Hero Nithin who turned as producer wants to produce a women-centric film with his Ishq movie co-star Nitya Menen playing lead role. young actor Viswak Sen directs the movie, and even will be seen as a hero.

నిర్మాతగా హీరో నితిన్.. లీడ్ రోల్ లో నిత్యా మీనన్..

Posted: 05/07/2019 08:06 PM IST
Nithin again turns as producer for nithya menen film

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫుల్ బిజీగా వున్నాడు. వరుసగా మూడు సినిమాలను సెట్ చేసుకున్న నితిన్.. ఆ మూడింటిలో 'భీష్మ' ముందుగా సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. వాటికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఇక తన స్నేహితుడు అక్కినేని అఖిల్ కోసం నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న నితిన్.. ఇటు చిత్రనిర్మాణ రంగంలోనూ మంచి బ్రేక్ కోసం వేచిచూస్తున్నాడు.

తాజాగా ఆయన ఒక వైవిధ్యభరితమైన సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. అందులోనూ అది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తొంది. ఈ చిత్రంలో తన ఇష్క సినిమాలోని హీరోయిన్ నిత్యామీనన్ నటించనున్నట్టు చిత్రపురిలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాకి యువ నటడు విష్వక్సేన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. దర్శకత్వ బాధ్యతలను నిర్వహించడంతో పాటు ఆయన ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కూడా కనిపించనున్నాడని అంటున్నారు.

‘ఫలక్ నుమా దాస్’ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఈ యువనటుడు మరోమారు నితిన్ నిర్మాణంలోని నిత్యామీనన్ చిత్రానికి కూడా మెగాఫోన్ పట్టనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో చేసి మెప్పించడం నిత్యామీనన్ కి అలవాటేననే విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రమైనా.. హీరో నితిన్ ను నిర్మాతగా ఇండస్ట్రీలో నిలబెట్టాలని మనసారా అశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Nithya Menen  Producer  Viswak Sen  'Falaknuma Das'  women-centric film  tollywood  

Other Articles