Mahesh Babu kids Enjoying on Maharshi sets ‘మహర్షి’ సెట్స్ లో ముగ్గురు చిన్నారి అతిధులు..

Mahesh babu kids gautham and sitara enjoying holidays on maharshi sets

Mahesh Babu, Gautham, Sitara, Vamsi Paidipally, Maharshi, Pooja Hegde, C. Ashwini Dutt, Dil Raju, Prasad V. Potluri, Vyjayanthi Movies, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

Mahesh Babu's kids Gautham and Sitara who were seen enjoying on the sets of Maharshi movie which is prestigious and 25th film of tollywood Prince. Both the children can be seen happily passing the time with the crew members of the film.

‘మహర్షి’ సెట్స్ లో ముగ్గురు చిన్నారి అతిధులు..

Posted: 03/13/2019 07:45 PM IST
Mahesh babu kids gautham and sitara enjoying holidays on maharshi sets

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కొద్దిరోజులుగా చెన్నైలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ చిత్రవర్గాల సమాచారం మేరకు కంప్లీట్ అయింది.

చిత్ర బృందంతో పాటు మహేశ్‌, వంశీ కుటుంబాలు కూడా చెన్నై వెళ్లి అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. అయితే మహేష్ కూతురు సితార, తనయుడు గౌతమ్ లు కూడా తమ సెలవులను మహర్షి సెట్లో బాగా ఎంజాయ్ చేశారు. అయితే తండ్రిలానే గౌతమ్ కొంత రిజర్వుగా వున్నాడు.. కానీ అన్ని పరిశీలిస్తూ వున్నాడని చిత్రవర్గాలు తెలిపాయి. వంశీ కూతురు ఆద్య లతో తాను గడిపిన సరదా సంగతులను తెలుపుతూ ట్వీట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్.

 

ఈ మేరకు ‘‘నా కంపోజిషన్‌ సెషన్‌ కి ఇద్దరు క్యూట్‌ అతిథులు వచ్చారు. వాళ్ళే సితార, వంశీ కుమార్తె ఆద్య. నా గిటారుతో సంగీతం వాయిస్తూ వాళ్లను ఇంప్రెస్‌ చేయడానికి ఎంతో ప్రయత్నించా. కానీ అది అంత సులభం కాదని తెలిసింది. పైగా వాళ్లే నన్ను సర్ ప్రైజ్‌ చేశారు. వాళ్ల ముద్దుముద్దు మాటలతో చాలా నవ్వించారు. ఇంతలా నేనప్పుడూ నవ్వలేదు. ఎంత గొప్ప సమయం. లవ్‌ యు కిడ్స్‌’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు దేవి శ్రీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Gautham  Sitara  Vamsi Paidipally  Maharshi  Pooja Hegde  C. Ashwini Dutt  Dil Raju  PVP  tollywood  

Other Articles