Mahesh Babu's Maharshi's release date postponed again ? మహేష్ ‘మహార్షి’ విడుదల తేదీలో మార్పు..

Release date of maharshi starring mahesh babu gets pushed again

Mahesh Babu, pooja hegde, Bharat Ane Nenu, Maharshi, Vamsi Paidipally, Pokiri, maharshi release date, latest movie news, tollywood, movies, entertainment

Telugu superstar Mahesh Babu will be next seen in the film Maharshi. The movie is being directed by Vamsi Paidipally. However, it looks like the release date of Maharshi has been pushed again.

మహేష్ ‘మహార్షి’ విడుదల తేదీలో మార్పు..

Posted: 01/17/2019 06:14 PM IST
Release date of maharshi starring mahesh babu gets pushed again

టాలీవుడ్ సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రంగా రూపోందుతున్న మహర్షి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెకే్కలా తగు జాగ్రత్తులు తీసుకుంటున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈ చిత్రం మహేష్ అభిమానుల హృదయాలలో ఎప్పటికీ ప్రతీ ఫ్రేమ్ లోనూ తనదైన అసక్తిని కనబరుస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుస్వరాల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తొలి టీజర్ తోనే చిత్రంలో మహేష్ విద్యార్థిగా కాలేజీలోకి వెళ్తూ.. రోటిన్ కు భిన్నంగా అమ్మాయిలను వెనక్కి తిరిగి మరీ చూస్తూ వెళ్లే టీజర్ అదరిపోయింది. అయితే మహేష్ కెరీర్ లో ఓ ముఖ్యచిత్రంగా దీనిని తెరకెక్కించి.. సంక్రాంతి బరిలో దింపేందుకు సన్నధం కాగా కొన్ని చిక్కులతో చిత్రాన్ని ఏప్రిల్ తొలివారంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేశారు.

అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీలో మళ్లీ మార్పు వచ్చిందని టాలీవుడ్ సర్కిల్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మహర్షి విడుదల తేదీని ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ఆలోచిస్తోంది. మహేష్‌బాబు గత సినిమాలు పోకిరి, భరత్ అనే నేను ఏప్రిల్ చివరివారంలో విడుదలై భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా అదే సెంటిమెంట్ ప్రకారం మహేష్ కు  అచ్చొచ్చిన ఏప్రిల్ చివరి వారంలో విడుదలకు మహేష్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మూవీ యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  maharshi  Pooja Hegde  release date  Vamsi paidipally  tollywood  

Other Articles