Producer K Raghava passes away at 105 సీనియర్ నిర్మాత కె.రాఘవ ఇక లేరు..

Senior producer of tollywood k raghava passes away at 105

Tollywood,Veteran producer K Raghava,Producer Kotipalli Raghava,Producer K Raghava died,Kotipalli Raghava heart attack,Kotipalli Raghava last rites,Kotipalli Raghava movies,K Raghava hit films,Tata manavadu Samsaram Sagaram,Thoorpu Padamara,Intlo Ramayya Veedhilo Krishnayya, tollywood, movies, entertainment

Senior producer of Telugu film industry K Raghava passed away in Hyderabad on Tuesday at 105. He was one of the senior producers of Tollywood and the owner of Pratap Arts Productions.

సీనియర్ సినీ నిర్మాత శతాధిక రాఘవ కన్నుమూత

Posted: 07/31/2018 12:36 PM IST
Senior producer of tollywood k raghava passes away at 105

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నిర్మాత, నటుడు కె. రాఘవ పరమపదించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయన గుండెపోటుకు గురై మరణించారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ను స్థాపించి అనేక ప్రేక్షకాధరణ పోందిన చిత్రాలను నిర్మించిన కోటిపల్లి రాఘవ దేశీయ వందేళ్ల సినిమా పండుగను వీక్షించారు. చిత్రపరిశ్రమలో అతికొద్ది మంది శతాధికులలో ఆయన ఒకరిగా వున్నారు. ప్రస్తుతం 105 సంవత్సరాలు వున్నా ఆయన అనంతవాయువులలో విలీనం కావడం చిత్రపరిశ్రమ వర్గాలు విషాదంలో మునిగాయి.

రాఘవ 1913లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో జన్మించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోల్ కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్ గా జీవితం ప్రారంభించిన ఆయన.. జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. ఆ బ్యానర్లో ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. తాతామనవడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, సంసారం సాగరం, జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్య చంద్రులు, అంతులేని వింతకథ, జగత్ జంత్రీలు వంటి సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు. ఆయన నిర్మాణసారధ్యం వహించిన 27 చిత్రాల్లో 25 చిత్రాలు సూపర్ హిట్లయ్యాయి. దీని బట్టి ఆయనకు చిత్రాలపై వాటి కథలపై వున్న పట్టు ఎలాంటిదన్నది స్పష్టం అవుతుంది.

దర్శక రత్న దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణతో పాటూ ఎంతోమంది దర్శకుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన ఆయన.. ఎందరో నూతన నటుల్ని తెలుగు ఇండస్ట్రీకి ఈయనే పరిచయం చేశారు. అంతేకాదు ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 1972లో తాతమనవడు.. 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డులు దక్కాయి. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు వచ్చింది. కె.రాఘవ మృతిపై టాలీవుడ్‌తో పాటూ పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : k raghava  senior producer  telugu film industry  raghava passes away  tollywood  

Other Articles