Rangasthalam completes 50 days at theatres రాంచరణ్ ‘రంగస్థలం’ 50 రోజుల దాటి దూసుకెళ్తూంది..

Ram charan attack on box office rangasthalam 50 glorious day

Rangasthalam, Ram Charan, Sukumar village drama, Pawan Kalyan, Samantha Akkineni, devisri prasad, Baahubali franchise, movies, entertainment, tollywood

Ram Charan’s latest outing Rangasthalam has struck the jackpot at the box office as it continues its successful run, having crossed 50 days of theatrical run.

రాంచరణ్ ‘రంగస్థలం’ 50 రోజుల దాటి దూసుకెళ్తూంది..

Posted: 05/18/2018 07:04 PM IST
Ram charan attack on box office rangasthalam 50 glorious day

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను నెలకొల్పి ముందుకు దూసుకెళ్తుంది. గత నెలలో ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లు సినీ నిర్మాణ వర్గాలు అధికారికంగా వెల్లడించిన గణంకాలు స్పష్టం చేయగా, తాజాగా.. ఈ చిత్రం.. ఈ మధ్యకాలంలో అతితక్కువ చిత్రాలు మాత్రమే సాధించే అరుదైన ఫీటును కూడా సాధఇంచింది. ఏకంగా 50 రోజుల పండుగను పూర్తి చేసుకుని ముందకు దూసుకెళ్తుంది.

ధృవ చిత్రంతో మంచి హిట్ అందుకున్న రాంచరణ్ తేజ్.. చాలా కాలాంటా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోట్టాలన్న కోరికను రంగస్థలం చిత్రం ద్వారా తీర్చుకున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ నటనకు సాటిలేదని రుజువైంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను వసూళ్ల పరంగా దుమ్మురేపేసింది. దర్శకుడిగా సుకుమార్ ను ఈ సినిమా మరో మెట్టుపైన నుంచో బెట్టింది. అలా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో సందడి చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రం విడుదలైన తరువాత మహేష్ భరత్ అను నేను చిత్రం, అల్లు అర్జున్ నా పేరు సూర్య అనే చిత్రాలు విడుదలైనా.. రంగస్థలం దూకుడుకు మాత్రం కళ్లాలే వేయలేకపోయాయి.  ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించిన ఈ సినిమా, 120 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. ఓ వైపు అటు ఆమేజాన్ ప్రైమ్ లో చిత్రం అందుబాటులో వున్నా.. ఇటు పలు సినిమా థీయేటరల్లో ఈ చిత్రం యాభై రోజులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రాంచరణ్, సమంతల నటన, చిత్ర దర్శకుడు, కెమెరామెన్ల పనితనం, సంగీతం, సాహిత్యం, ఇలా అన్ని బలంగా నిలిచి చిత్ర విజయంలో పాలుపంచుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles