RRR!! Rajamouli's Multistarer Official Now అధికారికంగా వెల్లడించిన డీవీవీ.. #RRR అంటే తెలుసా.?

Rrr rajamouli s multistarer official now

#RRR, Ram Charan, NT Rama Rao, Rajamouli, Test Shoot, DVV danaiah, official announcement, Los Angeles, Tollywood

A huge multi-starrer with Mega Power Star Ram Charan and Young Tiger NTR as the main leads is all set to create records. The news is official now. This project is not yet titled and is given RRR as the temporary title which denotes Rajamouli, Ram Charan, and Rama Rao.

అధికారికంగా వెల్లడించిన డీవీవీ.. #RRR అంటే తెలుసా.?

Posted: 03/23/2018 08:23 AM IST
Rrr rajamouli s multistarer official now

బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంతో ఆ తరువాత చిత్రం ఏంటా..? అంటూ యావత్ దేశం ఎదురుచూస్తున్న క్రమంలో ఆయన మరో ఫౌరాణిక చిత్రం రూపొందించే పనిలో వున్నారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ లతో కలసి ఓ మల్టీస్టారర్ చిత్రం రూపోందిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే మల్టీ స్టారర్ వార్తలు ఊపందుకోవడంతో ఇలా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో కన్ఫాఫ్ కూడా అంటూ వార్తలు వచ్చేశాయి. ఇక ఇటీవల వారితో కలసి రాజ‌మౌళి లాస్ యాంజిల్స్ కూడా వెళ్లారని, అక్కడ ఫోటో షూట్ కూడా జరిగిందని ఇలా అనేక రకాలు అనేక వార్తలు చిత్రపురిలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవాళ ఓ వీడియోను సోషల్ మీడియా యూట్యూట్ లో పోస్టు చేసింది. రాజమౌళి బాహుబలి చిత్రం తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రాన్ని రూపోందిస్తున్నారంటూ ఇవాళ డీవీవీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు 23 సెకన్లు నిడివి ఉన్న ఓ వీడియో విడుదల చేసింది.

రామ్‌ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి మల్టీస్టారర్ మూవీని అధికారికంగా ప్రకటించడంతో అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానుల్లో అనందం వెల్లివిరుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయని రాజమౌళి తాత్కాలికంగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుగా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా.. రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు. అంటూ ఈ వీడియో విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #RRR  Ram Charan  NT Rama Rao  Rajamouli  Test Shoot  DVV danaiah  official announcement  Los Angeles  Tollywood  

Other Articles