Salman Khan's Co-Star Ill and Penniless దీనస్థితిలో సల్మాన్ హీరోయిన్.. సాయం కోసం ఎదురుచూపు..

Salman khan s veergati co star pooja dadwal ill and penniless

Veergati, Pooja Dadwal Veergati, Veergati Salman Khan, Veergati Pooja Dadwal Salman Khan, Veergati poster, Veergati movie, Salman Khan, Salman Khan movies, Pooja Dadwal, Pooja Dadwal movies, Pooja Dadwal Salman Khan, Pooja Dadwal TB, Pooja Dadwal bankcurropt, Pooja Dadwal penniless, Pooja Dadwal TB, Pooja Dadwal Tuberculosis, entertainment, movies, Bollywood

According to latest reports, actor Nayanthara has joined the shooting of Sye Raa Narasimha Reddy which stars megastar Chiranjeevi in the titular role, will shoot for important portions involving her.

దీనస్థితిలో సల్మాన్ హీరోయిన్.. సాయం కోసం ఎదురుచూపు..

Posted: 03/20/2018 03:02 PM IST
Salman khan s veergati co star pooja dadwal ill and penniless

బాలీవుడ్‌ కంకలవీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న నాటి హీరోయిన్ ప్రస్తుతం కడు దీన స్థితిలో వుంది. అమె మరోవరో కాదు.. నటి పూజా దడ్వాల్‌. ప్రస్తుతం అమె తీవ్ర అనారోగ్యంతో బతుకు పోరాటం చేస్తున్నారు. క్షయ వ్యాధితో బాధపడుతున్న అమెను అమె భర్త, పిల్లలు వదిలేయడంతో అమె దిక్కుతోచని స్థితిలో వున్నారు. కనీసం కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని స్థితిలో ఉన్ననని.. ఇదే తలచుకుని అమె మనోధైర్యాన్ని కోల్పోతున్నారు.

రెండు దశాబ్ధాల క్రితం 1990ల్లో సినిమాల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమె అప్పట్లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కూడా ‘వీర్‌ ఘటి’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం కడు దీనస్థితిలోకి వున్న అమె సాయం కోసం సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తనకు క్షయ ఉందని ఆరు నెలల క్రితం తెలిసిందని దాంతో వైద్య సాయం కోసం అయ్యే ఖర్చుల కోసం సల్మాన్ ను కలవడానికి యత్నించి విఫలమయ్యానని చెప్పారు.

అయితే తన వ్యాధి గురించి సల్మాన్ కు కనీసం మీడియా ద్వారా తన గురించి తెలుసుకుని సాయం చేస్తారని ఆశిస్తున్నాననని అమె తెలిపారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటున్నానని, అయితే ప్రస్తుతం కప్పు టీ కోసం కూడా ఇతరులపై అధారపడ్డానని, ఇదే విషయం తనను కలచివేస్తుందని అమె తన అవేదనను వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాను. ఉన్న డబ్బంతా దానికే అయిపోయిందని. ఇప్పుడు తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని అమె తన దీనస్థితిని తెలుపుతూ కన్నీళ్లపర్యంతమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Veergati  Pooja Dadwal  Salman Khan  Tuberculosis  entertainment  movies  Bollywood  

Other Articles