Tarun Arora antagonist in Ravi Teja AAA | మెగా విలన్ కు మరో అవకాశం..

Tarun arora antagonist for mass raja

Tarun Arora, Ravi Teja, Director Srinu Vaitla, Amar Akbar Anthony, Tarun Arora AAA, Tarun Arora New Movie

Tarun Arora got another opportunity in Tollywood. Tarun Arora plays antagonist role in Ravi Teja-Srinu Vaitla's Amar Akbar Anthony.

రవితేజ మూవీలో విలన్ గా తరుణ్ అరోరా

Posted: 03/10/2018 12:13 PM IST
Tarun arora antagonist for mass raja

అస్సాం నటుడు, నటి అంజలా ఝవేరి భర్త తరుణ్ అరోరా. కోలీవుడ్ లో కణిథన్ తో సౌత్ సినిమాల్లో అడుగుపెట్టిన ఇతగాడికి స్టైలిష్ విలన్ గా తక్కువ టైంలోనే మంచి పేరు వచ్చింది. అవే ఖైదీ నంబర్ 150, కాటమరాయుడు చిత్రాల్లో అవకాశం కల్పించింది. ఆ తర్వాత జయ జానకీ నాయకలోనూ అతను మెప్పించాడు.

తాజాగా తరుణ్ ను మరో చిత్రానికి ఎంపిక చేశారు. రవితేజ శీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం నిన్న అధికారికంగా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తరుణ్ ను విలన్ గా తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ కోసం ఎంపిక జరుగుతోంది.

కాజల్ కోసం ట్రై చేస్తుండగా ఆమె బెట్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నివేధా థామస్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles