At Last Mahesh Allu Arjun Release Dates Change | వెనక్కి తగ్గిన మహేష్.. ముందుకు వెళ్లిన బన్నీ?

Mahesh bunny movies release date change

Allu Arjun, Naa Peru Surya, Bharat Ane Nenu, Mahesh Babu, Release Dates, Tollywood Summer Race, Release Dates for Bunny Mahesh

Na Peru Surya and Bharat Ane Nenu Release Dates Changed, But, Official Announcement yet to wait.

మహేష్-బన్నీ.. రిలీజ్ తేదీల్లో మార్పులు?

Posted: 02/21/2018 04:40 PM IST
Mahesh bunny movies release date change

సమ్మర్ సమరానికి టాలీవుడ్ నుంచి ఇద్దరు, డబ్బింగ్ మూవీతో సూపర్ స్టార్ సిద్ధం కావటంతో మే చివరి వారం హాట్ హాట్ గా సాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. ముఖ్యంగా మహేష్-బన్నీ మధ్య వార్ గురించి విపరీతమైన చర్చలు జరిగాయి.

రిలీజ్ డేట్ లో మార్పులేవీ ప్రకటించకుండా దాదాపు ఒకే తేదీలో వచ్చేయాలని ఈ ఇద్దరు స్టార్ హీరోలు డిసైడ్ అయ్యారు. షూటింగ్ ప్రారంభం రోజే బన్నీ.. తర్వాత భరత్ అను నేను తో మహేష్ ఒకే తేదీని ప్రకటించారు. ఇంతలో రజనీ కాంత్ కాలా చిత్ర విడుదల తేదీని ప్రకటించేశారు.

తర్వాత కాస్త తగ్గిన రెండు చిత్రాల నిర్మాతలు ఓ రోజు ముందుకు జరిగి మళ్లీ ఒకటే తేదీ(ఏప్రిల్ 26వ తేదీ)ని అనౌన్స్ చేసి పోటీ వాతావరణం సృష్టించారు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు. వరస చర్చల అనంతరం ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో భరత్ అను నేను.. మే 5వ తేదీన నా పేరు సూర్య రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారంట. ఇదే తేదీలు కాకపోయినా ఒకటి రోజుల తేడాతో వీరు అధికారిక ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది. ఇక రజనీ కాంత్ కాలా మాత్రం యథాతథంగా ఏప్రిల్ 27వ తేదీనే రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles