Chalo Director Next Under Big Banner | ఛలో డైరెక్టర్ కు బిగ్ ఛాన్స్.. బిగ్ బ్యానర్ లో మూవీ!

Chalo director next confirmed

Venky Kudumula, Chalo Movie, Haarika and Haasini Creations, Venky Kudumula Next

Chalo Director Venky Kudumula Confirms his next under Haarika and Haasini Creations. The Movie may go floors after NTR-Trivikram Movie.

ఛలో డైరెక్టర్ కు బిగ్ ఛాన్స్

Posted: 02/10/2018 04:12 PM IST
Chalo director next confirmed

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం. అనుభవజ్నులైన డైరెక్టర్లు విఫలమవుతున్న టైంలో.. కొత్త డైరెక్టర్లు ఆకట్టుకునే కథలతో హిట్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొందరికి మంచి అవకాశాలు దక్కుతుండగా.. మరికొందరు మాత్రం తమ కెరీర్ లో నిలదొక్కుకునేందుకే శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన వెంకీ కుడుములకు మరో ఛాన్స్ దక్కింది.

నాగశౌర్య, రష్మిక మందన జంటగా వెంకీ దర్శకత్వంలో 'ఛలో' సినిమా తెరకెక్కింది. యాక్షన్ కామెడీతో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది .. భారీ వసూళ్లతో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఓ బడా ప్రొడక్షన్ సంస్థ నుంచి ఆయనకు పిలుపు అందిందంట.

హారిక అండ్ హాసిని బ్యానర్ వారు ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వెంకీ కుడుముల వినిపించిన లైన్ నచ్చడంతో, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే పనిలో ఆయన వున్నాడని అంటున్నారు. స్టార్ హీరో .. హీరోయిన్స్ తో ఈ సినిమా వుండనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ బ్యానర్ వెంకీ కుడుముల ప్రాజెక్టుపై దృష్టి సారించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles