Srinivas Reddy Back with Jamba Lakidi Pamba | శ్రీనివాస్ రెడ్డి హీరోగా కొత్త చిత్రం.. టైటిల్ తోనే సగం హిట్టు.. ఏంటో తెలుసా?

Jamba lakidi pamba movie

Srinivas Reddy, Jamba Lakidi Pamba, Director Murali Krishna, Jamba Lakidi Pamba 2018

Srinivas Reddy New Movie Title Jamba Lakidi Pamba. Murali Krishna Directs the movie.

జంబ లకిడి పంబ టైటిల్ తో కొత్త సినిమా

Posted: 12/29/2017 04:57 PM IST
Jamba lakidi pamba movie

కమెడియన్ గా ఓవైపు కొనసాగుతూనే శ్రీనివాస్ రెడ్డి హీరోగా సక్సెస్ అవుతున్నాడు. పూర్తిగా హీరోగా కాకుండా పార్ట్ టైమ్ గా చేస్తూ హిట్ లు ఖాతాలో వేసుకుంటున్నాడు. 'గీతాంజలి' .. ' జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలు కథానాయకుడిగా ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. తాజాగా ఓ చిత్రం సెట్స్ మీద ఉండగానే.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'జంబలకిడి పంబ' పేరిట మురళీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజునే మొదలైంది. ఈ సినిమా షూటింగ్ మార్చి 10వ తేదీ వరకూ కంటిన్యూగా జరుగుతుందని నిర్మాతలు చెప్పారు. హైదరాబాద్ .. గోదావరి జిల్లాలు .. కేరళలో షెడ్యూల్స్ ను ప్లాన్ చేశామని అన్నారు.

ఇక శ్రీనివాస్ రెడ్డి పోషిస్తోన్న పాత్ర ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని దర్శకుడు మురళీ చెబుతున్నాడు. పోసానితోపాటు వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. కథా కథనాలపరంగా గతంలో వచ్చిన 'జంబలకిడి పంబ'తో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆ మూవీ మాదిరిగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీరోయిన్ ఎవరన్నది మరికొద్దిరోజులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles