పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సర్ ప్రైజ్ వచ్చేసింది. పవన్ కల్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెద్దఎత్తున్న వున్నాయి. పవన్ 25వ చిత్రం కాబట్టి హైప్ కూడా క్రియేటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ఫస్ట్ లుక్ పై కూడా పవన్ అభిమానుల్లో టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తుంది.
కాగా ఈ చిత్రానికి ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే 'అజ్ఞాతవాసి' అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది. ఫస్ట్‌లుక్‌లో పవన్ సోఫాలో స్టైల్‌గా కూర్చుని కోపంగా చూస్తూ చేతిలో ఐడీ కార్డు తిప్పుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. దీంతో ఇది కూడా అత్తారింటికి దారేది అన్న కథాంశం నేపథ్యంలోనే వస్తుందన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇలా విడుదలైందో లేదో.. అలా ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు అభిమానులు. రెండురోజుల నుంచే ‘పీఎస్ పీకే 25 ఫస్ట్ లుక్’ అన్న హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఈ ఉదయం 10 గంటలకు విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్.. సాంకేతిక సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యంగా విడుదల చేశామని చిత్ర నిర్మాణ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాన్ సరసన హీరోయిన్లుగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాట ‘బయటికొచ్చి చూస్తే’కు విశేష ఆదరణ లభించింది. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more