CBFC Looking for Permanent Solution on Padmavati Issue | పద్మావతి వివాదానికి పర్మినెంట్ ముగింపు పలికే ఆలోచనలో సెన్సార్ బోర్డు.. అందుకోసం ఓ ఫ్లాన్

Cbfc on padmavati issue

Padmavati Movie, Padmavati Controversy, Padmavati CBFC, Padmavati Movie Solution, Prasoon Joshi Padmavati Issue

Padmavati controversy: Prasoon Joshi says CBFC needs space, time to come up with ‘balanced’ decision. The Board wants to take Historians opinion before certification and thinks its permanent solution.

పద్మావతి వివాదానికి సెన్సార్ బోర్డు పరిష్కారం?

Posted: 11/21/2017 05:47 PM IST
Cbfc on padmavati issue

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ తెరకెక్కించిన 'ప‌ద్మావ‌తి' చిత్రానికి స‌ర్టిఫికెట్ జారీ చేసే విష‌యంలో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ తో నడుస్తున్న వివాదం తెలిసిందే. 68 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోలేదనే తిరస్కరించినట్లు చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్న వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. పద్మావతి చిత్రానికి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా సీబీఎఫ్ సీ ఆలోచలు చేస్తోంది.

ఈ మేరకు చరిత్ర‌కారుల‌ను సంప్ర‌దించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో వివాదాలను పరిష్కరించేందుకే పాత నిబంధనను(68 రోజుల ముందు దరఖాస్తు) తెరపైకి తేవాల్సి వచ్చిందని సెన్సార్ బోర్డు చైర్మన్  ప్రసూన్ జోషి వెల్లడించారు. సరైన నిర్ణయం తీసుకోకుండా ముందు వెళితే మొత్తం చిత్ర పరిశ్రమ పైనే ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక 'ప‌ద్మావ‌తి' సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లైన ప‌ద్మావ‌తి, ర‌త‌న్ సింగ్‌, అల్లా ఉద్దీన్ ఖిల్జీల మ‌ధ్య ఉన్న సంబంధం గురించి స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కు సినిమా విడుద‌ల‌వుతుందో లేదోన‌న్న సందిగ్ధం ఏర్పడింది.

ఈ సినిమాలో రాజ్‌పుత్ రాణుల‌ను గౌర‌వాన్ని అగౌర‌వ‌ప‌రిచే స‌న్నివేశాలు ఉండి ఉంటాయని, చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడ‌ని రాజ్‌పుత్ సేన‌లు నిర‌స‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్‌, రాజ‌స్థాన్, యూపీలో ఏకంగా ఈ చిత్రాన్ని బ్యాన్ కూడా చేశారు. ఒక పెద్ద జాతి స‌మ‌స్య‌గా రూపాంత‌రం చెందిన ఈ వివాదానికి సీబీఎఫ్‌సీ నిర్ణ‌యంతోనే తెర‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని సుప్రీంకోర్టు తెలిపిన నేపథ్యంలో అదే సరైన పని అని సెన్సార్ బోర్డు భావిస్తోందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles