Ram Gopal Varma Sexy Comments on Her Back | ఎన్టీఆర్ బయోపిక్ : లక్ష్మీ పార్వతి.. మధ్యలోది మాత్రమే చూపిస్తాడంట!

Rgv reaction on ketireddy s ntr biopic

Ram Goapl Varma, Ram Goapl Varma Lakshmi's Veeragrandham, Lakshmi's Veeragrandham Movie, NTR Biopic, Lakshmi's Veeragrandham Movie Controversy, Lakshmi's Veeragrandham New Poster

Ram Goapl Varma Sexy Comments on Lakshmi's Veeragrandham Movie Poster. Third biopic on NTR Lakshmis Veeragrandham Announced by Ketireddy Jagadeeswar Reddy.

లక్ష్మీస్ వీరగ్రంథం ఫస్ట్ లుక్ విడుదల.. వర్మ స్పందన

Posted: 10/26/2017 09:05 AM IST
Rgv reaction on ketireddy s ntr biopic

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో మొదటి భాగం, ఆఖరి భాగం కాకుండా ఆ మధ్యలో జరిగిన విషయాలను తెరకెక్కిస్తానని.. ఇందులో ప్రజలకు తెలియని చాలా విషయాలు ఉంటాయని ఆయన అంటున్నారు.

లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు గారు హరికథలు చెప్పుకునేందుకు వాడవాడలా తిరిగే వారంట.. ఆయన నుంచి విడిపోయి ఎన్టీఆర్ కు ఎలా దగ్గరయ్యింది అనే విషయాలను పూసగుచ్చినట్లు వివరించే యత్నం చేయబోతున్నాడంట. తిరుపతిలో షూటింగ్ ప్రారంభించి.. నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ముందుగా చెప్పుకున్నట్లు నటి వాణీవిశ్వనాథ్ కు ఇందులో స్థానం కన్ఫర్మ్ అనే చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాత విజయ్ కుమార్ గౌడ్ ఆమెను కలిశారు కాబట్టి. ఎన్టీఆర్ పాత్ర సంగతి ఏమోగానీ.. వీరగంధం సుబ్బారావు పాత్రకు మాత్రం సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ తీసుకున్నట్లు కేతిరెడ్డి ప్రకటించారు.

లక్ష్మీస్ వీరగ్రంథం పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పై వర్మ స్పందించాడు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ‘లక్ష్మీస్ వీర గ్రంథం’ ఫస్ట్ లుక్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది’ అని వర్మ తనదైన శైలిలో పేర్కొన్నాడు. మొత్తానికి ఈ బయోపిక్ లో కూడా బోలెడన్నీ వివాదాస్పద అంశాలు ఉండబోతున్నాయన్న విషయం మాత్రం స్పష్టమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles