Soft Title for Mahesh Babu 25th Movie | మహేష్... మరీ అంత సాఫ్టా?

Mahesh 25th title fix or not

Mahesh Babu, 25th Movie, Mahesh 25th Movie Title, Mahesh Babu Soft Title, Mahesh Babu Vamsi Paidipally, Vamsi Paidipally Mahesh Title, Mahesh Babu Next Movie Title, Hare Rama Hare Krishna Krishna Mukunda Murari, Hare Rama Hare Krishna Mahesh Babu, Krishna Mukunda Murari Mahesh Babu

Mahesh Babu 25th Movie Title Fixed. Director Vamsi Paidipally Consider Hare Rama Hare Krishna, Krishna Mukunda Murari.

మహేష్ 25 టైటిల్ ఫిక్స్?

Posted: 10/23/2017 06:31 PM IST
Mahesh 25th title fix or not

మహేశ్ బాబు .. కొరటాల శివ కాంబోలో 'భరత్ అను నేను' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేశ్ బాబు కెరియర్లో ఇది 24వ సినిమా. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మహేశ్ బాబు .. తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమా టైటిల్ విషయంలో మహేశ్ అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా వున్నారు. ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఒక టైటిల్ 'కృష్ణా ముకుందా మురారి' అయితే, 'హరేరామ హరే కృష్ణ' అనేది మరో టైటిల్. ఈ రెండింటిలో 'కృష్ణా ముకుందా మురారి' టైటిల్ వైపు మొగ్గుచూపే అవకాశాలు వున్నట్టుగా చెబుతున్నారు. గ

తంలో 'బృందావనం' వంటి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించిన వంశీ పైడిపల్లి, ఈ సారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే మహేశ్ తో కలిసి రంగంలోకి దిగుతున్నాడనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్లు లేవు కాబట్టి అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles