Bunny's Kollywood debut to kick off Next Year | ఆ సినిమా ఆగిపోలేదు.. వచ్చే ఏడాది ఉంటుందంట.

Bunny bilingual movie confirmed

Allu Arjun, Director Linguswamy, Kollywood Debut, Bunny Tamil Movie, Bunny Movie, Allu Arjun Kollywood

Allu Arjun Linguswamy movie not shelved. A Strong source in the know informs that the film, Bunny’s Kollywood debut, could begin sometime in the summer of 2018.

బన్నీ-లింగుస్వామి మూవీ ఉంది

Posted: 10/14/2017 04:01 PM IST
Bunny bilingual movie confirmed

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత లింగుస్వామితో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. కొన్నాళ్ల క్రితం చెన్నైలో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టు పై ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ఆ ప్రాజెక్టు డౌటే అని అంతా అనుకున్నారు. ఈ గ్యాప్ లో మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దూరిపోయి అల్లు వారబ్బాయితో ఓ సినిమా ఫ్లాన్ చేస్తున్నాడని చెప్పుకున్నాం కూడా.

కానీ అల్లు అర్జున్ తర్వాతి సినిమా విషయంలో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. లింగుస్వామి కాంబినేషన్ కి సంబంధించిన ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయట. దీంతో ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. ఆ లోపు విశాల్ పందెం కోడి-2 షూటింగ్ పూర్తి చేసి లింగుస్వామి ఫ్రీ అవుతాడంట. ఆ సమయంలోనే'నా పేరు సూర్య ' పూర్తి చేసి అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుపైకి రానున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేసిన లింగుస్వామి, త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నాడని చెబుతున్నారు. హీరో సూర్య రిలేటివ్ జ్నాన్ వేల్ రాజా నిర్మించబోతున్న వీలైతే వచ్చే ఏడాది చివర్లోగానీ.. లేక 2019 లో గానీ విడుదలయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles