Mega Hero Funny Wishes to Rakul | రకుల్ కు మెగా హీరో ఫన్నీ విషెస్

Mega hero birthday wishes to rakul

Sai Dharam Tej, Rakul Preet Singh, Rakul Teju Funny Photo, Sai Special Wishes to Rakul, Rakul Birthday, Rakul Open Mouth Slept, Rakul Funny Photo

Sai Dharam Tej Funny Wishes to Rakul Preet Singh on Her Birthday, Posted Funny Pic in Mega Hero's Twitter.

రకుల్ కి సాయి ధరమ్ తేజ్ స్పెషల్ విషెస్

Posted: 10/10/2017 05:47 PM IST
Mega hero birthday wishes to rakul

తెలుగు, తమిళ్ లోనే కాదు.. హిందీలో ఇప్పుడు రకుల్ బిజీ హీరోయిన్. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సక్సెస్ తో మొదలైన ర‌కుల్ ప్రీత్ సింగ్‌ సక్సెస్ జర్నీ.. ఇప్పుడు టాప్ హీరోల సరసన చేసే స్థాయికి చేరుకుంది. బిజీ హీరోయిన్ గా ఉన్న రకుల్ ఇవాళ పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్విట్ట‌ర్‌లో చేసిన ఓ ఫోటో మాత్రం తెగ అలరిస్తోంది. రకుల్ నోరు తెరిచి నిద్ర పోతున్న ఫోటోను తేజూ అప్ లోడ్ చేశాడు. క‌ళ్ల‌జోడు పెట్టుకుని క్యూట్ గా ఉన్న ర‌కుల్ ను పక్కనుంచి దెప్పిపొడుస్తున్నట్లు వెటకారపు సైగ చేస్తూ సాయి ఆ సెల్ఫీ దిగాడు.

రకుల్ ని ల‌కుల్ అని సంభోదిస్తూ హ్యాపీ బ‌ర్త్ డే చెప్పాడు. వీరిద్దరూ కలిసి విన్నర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బహుశా ఆ షూటింగ్ లోనే ఈ ఫోటో దిగి ఉంటారని అంతా అనుకుంటున్నారు. అయితే సినిమా అంత సక్సెస్ కాకపోయినా వీరిద్దరి పెయిర్ ను మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles