Kangana Ranaut Sister Rangoli Re tart to Singer Sona.

Kangana satires to singer sona mahapatra

Kangana Ranaut, Hritik Roshan, Sona Mahapatra, Rangoli, Rangoli Sona Mahapatra, Kangana Sona Letter

Kangana Ranaut-Hritik Roshan Controversy. Singer Sona Mahapatra Letter to Kangana. Later Rangoli re tart to Sona.

కంగనాకు రంగోలీ సపోర్ట్.. సింగర్ పై సెటైర్లు

Posted: 09/09/2017 03:49 PM IST
Kangana satires to singer sona mahapatra

హృతిక్ తో అఫైర్ గురించి మరోసారి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన కంగాన మళ్లీ పెద్ద దుమారాన్నే రేపింది. హృతిక్ మూర్ఖుడు మోసగాడు అంటూ మొదలుపెట్టి తనను హింసించాడంటూ పెను దుమారాన్నే రేపిందామే. అయితే కంగనా వ్యాఖ్యలపై హృతిక్‌ రోషన్‌, ఆదిత్యా పంచోలి, శేఖర్ సుమన్, అతని కుమారుడు అధ్యాయన్ సుమన్ ఇలా పలువురు ముక్తకంఠంతో ఖండించారు.

సింగర్ సోనా మహాపాత్ర అయితే ఏకంగా కంగనా రనౌత్ కు ఓ ఓపెన లెటర్ రాసేసింది. కేవలం సిమ్రన్ చిత్ర ప్రచారం కోసమే మళ్లీ ఈ టాపిక్ ను తెరపైకి తెచ్చిందంటూ అందులో తీవ్ర విమర్శలు చేసింది. ఇది సరికాదని సూచిస్తూ పద్ధతి మార్చుకోవాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే సోనా లెటర్ ను కంగానా అంత పట్టించుకోలేదు. కానీ, కంగనా చెల్లి రంగోలీ మాత్రం భరించలేకపోయింది. ఇంతకు ముందు కంగనాపై విమర్శలు వినిపించిన సమయంలో కూడా రంగోలీ సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా తన అభిప్రాయాలు చెబుతున్నప్పుడు దాన్ని సర్కస్‌ అంటూ వ్యాఖ్యానించకు. మనుషుల జీవితాలు వారి ప్రయాణాలు, సినిమాలపై ఆధారపడి ఉండవు. నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి. నీలాంటి వాళ్లే పబ్లిసిటీ కోసం ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటారు’ అంటూ రంగోలీ, సోనాకు రిటార్ట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కంగనా సెక్స్ అడిక్ట్ గా నటించిన సిమ్రన్ చిత్రం వచ్చే వారమే రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles