Tollywood Celebs Worry About Their Successors.

Tollywood successors on the way

Tollywood Celebs, Tollywood Successors, Ravi Teja Son Maha Dhan, Balakrishna Son Mokshagna, Puri Jagannadh Son Akash Puri, Shivaji Raja Son

Tollywood New Trend is back again. Father-Son Duos Of Tollywood ready. Ravi Teja Son Maha Dhan, Balayya's Son Mokshagna and Puri's Son Akash Puri on the Way.

టాలీవుడ్.. వారసుల గురించే వర్రీ!

Posted: 09/06/2017 04:47 PM IST
Tollywood successors on the way

టాలీవుడ్ లో తనయుల ఫీవర్ కొనసాగుతోంది. రానున్న రెండేళ్లలో వరుస బెట్టి వారసుల డెబ్యూ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రవితేజ తనయుడు మహదేవన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ హల్ చల్ చేస్తోంది. బాల నటుడిగానే తండ్రి హీరోగా నటిస్తున్న చిత్రం రాజా ది గ్రేట్ ద్వారా మాస్ రాజా కొడుకు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. రానున్న రోజుల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించబోతున్నాడన్నది స్పష్టం అయిపోతుంది.

ఇక సగం హీరోగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ.. మెచ్యూర్డ్ హీరోగా కనిపించేందుకు రెడీ అయిపోతున్నాడు. తన దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుందని పూరీ ఇప్పటికే స్పష్టం చేశాడు కూడా. ఆకాశ్ బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించటమే కాదు.. ఆ మధ్య ఆంధ్రాపోరి అంటూ ఓ సినిమాలో హీరోగా చేశాడు కూడా.

చివరగా చెప్పుకోవాల్సింది నందమూరి వారసుడు మోక్షజ్న గురించి.. గౌతమీపుత్ర శాతకర్ణి సమయంలోనే బాలకృష్ణ తనయుడి ఆరంగ్రేటం ఉంటుందని చెప్పుకున్నాం. కానీ, ఇంకా టైముందంటూ బాలయ్య అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మధ్య పైసా వసూల్ ప్రమోషన్ టైంలో వచ్చే ఏడాదే తన వారసుడి ఎంట్రీ ఉంటుందంటూ చెప్పేశాడు. జూన్ నెలలో వీలైతే తన పుట్టిన రోజే కొడుకు లాంఛ్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. మోక్షజ్న లుక్ కు సంబంధించి ఓ ఫోటో నెట్ లో వైరల్ అవుతోంది. డీసెంట్ లుక్కుతో ఉన్న నందమూరి వారసుడు.. రానున్న రోజుల్లో ఇండస్ట్రీని ఏలటం ఖాయమనే బాలయ్య ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

వీళ్లే కాదు.. పవన్ వారసుడు అకీరా.. మహేష్ తనయుడు గౌతమ్(వన్ నేనోక్కడినే).. బన్నీ కొడుకు అయాన్.. ఎన్టీఆర్ పుత్రరత్నం అభయ్.. చిన్నతనంలోనే వారి వారి వారసులను తమ చిత్రాల ద్వారానే ఆరంగ్రేటం చేయించేందుకు సిద్ధమైపోతున్నారు. వీరితో శివాజీ రాజా లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తమ పిల్లలను సినిమాల్లోకి తెచ్చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles