డేరా అల్లర్లలో చిక్కుకున్న అలియా.. హోటల్ లోనే సేఫ్? | Alia Bhatt struck in Dera Clashes

Alia bhatt raazi shooting stopped due to dera clash

Alia Bhatt, Raazi Movie Shooting, Patiala, Dera Violence, Alia Bhatt Gurmeet Singh

Curfew imposed in Patiala, Alia Bhatt says she's safe, Raazi shooting postponed

డేరా అల్లర్లలో అలియా భట్.. సేఫ్ గా ఉన్నట్లు ట్వీట్

Posted: 08/29/2017 06:44 PM IST
Alia bhatt raazi shooting stopped due to dera clash

డేరా బాబా అల్లర్లలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ ఇరుక్కుపోయింది. అలియా భట్ ప్రధాన పాత్రలో రాజీ అనే సినిమాను మేఘనా గుల్జార్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్ సరసన విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. కాగా, హరీందర్ సిక్కా రాసిన నవల 'సెహ్మత్' ఆధారంగా ఈ 'రాజీ' చిత్రం తెరకెక్కుతోంది.

ఈ నేపథ్యంలో నేటివిటీ కోసం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పంజాబ్ లోని పటియాలాలో పెట్టుకున్నారు. సెప్టెంబర్ పది వరకు ఈ షెడ్యూల్ జరగాల్సి ఉంది. అయితే గత 25న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ కు అత్యాచారం కేసులో శిక్ష పడింది. ఆ సమయంలో ఈ చిత్రయూనిట్ షూటింగ్ లో ఉంది. అప్పటికే పోలీసుల హెచ్చరికలు, మీడియాలో వార్తలు చూడడంతో చిత్ర యూనిట్ షూటింగ్ రద్దు చేసుకుంది.

షూటింగ్ పరికరాలు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండడంతో షెడ్యూల్ ను ఆపేశారు. దీంతో అలియా భట్ హోటల్ రూమ్ కే పరిమితమైంది. బయటకు వచ్చేందుకు కూడా సాహసం చేయడం లేదు. అయితే తామంతా సేఫ్ గా ఉన్నట్లు అలియా ట్వీట్ చేసిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dera Violence  Alia Bhatt  Raazi Movie  

Other Articles