మాజీ ప్రియుడితో చేయాలంటే ఒక్క కండిషన్ | Aish Put Condition to Work with Salman Khan

Salman aishwarya first consider for padmavati

Salman Aish Padmavati, Aishwarya Condition Salman Khan, Salman Khan Sanjay Leela Bhansali Movie, Padmavati Actual Stars, Story behind Pasmavati, Aishwarya Ex Boyfriend

Aishwarya Rai Bachchan Agreed to do Padmavati with Salman Khan, But If Salman plays Negative she Accepts. Later Salman Denied that hence Sanjay Leela Approach Deepika Ranveer.

పద్మావతి ఒరిజినల్ కాస్ట్ సల్మాన్, ఐష్!

Posted: 08/23/2017 06:36 PM IST
Salman aishwarya first consider for padmavati

బాలీవుడ్ భారీ చిత్రాల మేకర్ సంజయ్ లీలా బన్సాలీ ఈ మధ్య వరుసగా చరిత్ర నేపథ్యం ఉన్న కథలనే ఎంచుకుంటూ వస్తున్నారు. తాజాగా 'పద్మావతి' సినిమాతో మరో మూవీని తెరకెక్కిస్తున్న బన్సాలీ అందుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను మీడియాకు వెల్లడించారు.

నిజానికి ఈ సినిమా దీపికా-సల్మాన్ బదులు ఐష్-సల్మాన్ తో ఫ్లాన్ చేశాడంట. అయితే ఇద్దరూ ఈ విషయంలో కాంప్రమైజ్ కాకపోవటంతో ప్రాజెక్ట్ యంగ్ లవ్ కపుల్ చేతికి వెళ్లిందని చెబుతున్నారు. తొలుత ఈ విషయమై ఐశ్వర్య రాయ్ ను సంప్రదించగా, ఓకే చెప్పిన ఐష్ రాజు పాత్రలో కాకుండా విలన్ అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రను సల్మాన్ చేస్తే ఓకే నని చెప్పిందంట. దీంతో ఇదే విషయాన్ని సల్మాన్ దగ్గర ప్రస్తావిస్తే ఐష్ మూవీలో చచ్చినా విలన్ రోల్ చేయనని తేల్చేశాడంట.

అలా ఈ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో .. దీపికా పదుకొనె - రణవీర్ సింగ్ లకు వెళ్లిందని, రాజు రోల్ షాహిద్ కపూర్ ఓకే చేయటంతో చిత్రీకరణ కొనసాగుతూ వస్తోంది. గతంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ప్రేమ వ్యవహారం, ఆ తరువాత మనస్పర్థల కారణంగా వాళ్లు దూరం కావడం తెలిసిందే. ఆ పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కలిసి నటించలేదు. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన ఈ జంటను వెండితెరపై చూడాలనుకుంటున్న కోరికను సంజయ్ తీర్చాలని యత్నించి ఫేలయ్యాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Aishwarya Rai  padmavati Movie  

Other Articles