బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం టాయ్ లెట్ భాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లనే రాబడుతోంది. వీక్ టాక్ తో మొదలైన చిత్రానికి పెద్దగా క్రౌడ్ రాలేకపోయినా కేవలం అక్కీ పేరు మూలంగానే ఆ మాత్రం అయినా కలెక్షన్లు రాగలిగాయి.
అయితే బహిరంగ మలవిసర్జనను నిషేధించాలన్న కాన్సెప్ట్ మాత్రం జనాల్లోకి ఎక్కించేందుకు హర్యానా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. `టాయ్‌లెట్` సినిమాను గ్రామాల్లో పనిచేసే సర్పంచ్, వీఆర్ఓలతో పాటు ప్రతి ఒక్క గ్రామాధికారి తప్పకుండా వీక్షించాలని హర్యానా ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు హర్యానా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఓపీ ధన్‌ఖర్ మార్గదర్శకం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రధాని నరేంద్రమోదీ `స్వచ్ఛ్ భారత్ అభియాన్` ఆశయానికి మద్దతు తెలియజేస్తూ, బహిరంగ మలవిసర్జనను హాస్యపూరకంగా ఈ సినిమాలో చూపించారు. మెట్టినింట్లో టాయ్‌లెట్ లేకపోవడంతో పుట్టింటికి వెళ్లిపోయిన ప్రియాంక భారతీ కథ ఆధారంగా శ్రీ నారాయణ్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఐక్యరాజ్య సమితి నుంచి కూడా విశిష్ట గుర్తింపు రావటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లు వసూలు చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more