చైతూ జెట్ స్పీడ్.. యూనిక్ టైటిల్ తో ఫస్ట్ లుక్ | Unique Title for Naga Chaitanya Chandoo Mondeti Next

Savyasachi first look released

Naga Chaitanya, Naga Chaitanya New Movie, Naga Chaitanya Savyasachi, Naga Chaitanya New Movie First Look, Savyasachi First Look, Savyasachi First Look Poster, Savyasachi Chandoo mondeti New Movie, Savyasachi First Look Review

Naga Chaitanya's next film titled 'Savyasachi'. First Look Released and shooting starts from September. Premam fameChandoo Mondeti Direct Savyasachi.

నాగ చైతన్య సవ్యసాచి ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 08/16/2017 12:30 PM IST
Savyasachi first look released

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య పుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే రారండోయ్.. సక్సెస్ తో ఓ హిట్ తన ఖాతాలో వేసుకున్న చై యుద్ధం శరణం గచ్ఛామి అంటూ మరో మాస్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. ఇది ఇంకా సెట్స్ మీద ఉండగానే సవ్యసాచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఒక్కసారిగా షాకిచ్చేశాడు.

నిజానికి చై కెరీర్ ప్రారంభం నుంచే డల్ గా సాగింది. హీరోయిన్ ఒరియంటల్ మూవీస్ తో హిట్లు కొట్టాడని, సోలోగా సక్సెస్ కాలేకపోతున్నాడని, మరీ ముఖ్యంగా మాస్ మూవీస్ తో రాణించలేకపోయాడన్న విమర్శలు వినిపించాయి. దీంతో సీన్ లోకి ఎంటర్ అయిన నాగ్ కొడుకు కెరీర్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడంట. తోటి హీరోలు వరుసగా ఏడాదికి రెండు, మూడు చిత్రాలతో వస్తుండటంతో కథల ఎంపిక దగ్గరి నుంచి చిత్ర రిలీజ్ డేట్ లను సైతం ఫిక్స్ చేయటం వరకు అంతా నాగ్ పర్యవేక్షణలోనే జరుగుతోందని చెప్పుకుంటున్నారు. యుద్ధం శరణం.. ఇప్పుడు కొత్త చిత్రం కథలు కూడా నాగ్ ఛాయిసే అని తెలుస్తోంది.

ఇక 'ప్రేమమ్' తర్వాత చందూ మొండేటి కాంబోలో 'సవ్యసాచి' చేయబోతుండగా, లోగోను ఈరోజు రిలీజ్ చేశారు. రెండు బలమైన చేతులు పదునైన ఆయుధాలను ధరించివున్న పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. చూస్తుంటే మరో మాస్ సబ్జెక్ట్ తోనే చైతూ రాబోతున్నాడని అర్థమౌతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని చైతూ అఫీషియల్ గా చెప్పేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Chandoo mondeti  Savyasachi Movie  First Look Poster  

Other Articles