సాహో.. జస్ట్ గ్రాఫిక్స్ చూసి అంచనా వేయొద్దు | Prabhas Saaho Just An Action Entertainer

Prabhas clarity on saaho genre

Saaho, Saaho Story, Saaho Hollywood Technicians, Saaho Prabhas Interview, Saaho Pooja Hegde, Saaho Story Leak, Action Entertainer Saaho, Saaho Socio Fantasy, Saaho not Si Fic Movie

Prabhas Clarity on Sahoo Story Line. ‘Saaho‘ will be completely set in the contemporary times and it is an action entertainer, the makers want to make it big and hence roped in Hollywood stunt master Kenny Bates. Prabhas feels that the script of ‘Saaho’ is intriguing enough to excite the audiences across the country.

సాహో స్టోరీపై ప్రభాస్ క్లారిటీ

Posted: 07/31/2017 11:24 AM IST
Prabhas clarity on saaho genre

ఓవైపు యంగ్ రెబల్ స్టార్ కొత్త లుక్కు నెట్ లో వైరల్ అయిపోతుంది. చాలా స్టైలిష్ గా ప్రభాస్ ఉన్నాడంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన సినిమా సెట్స్ లో త్వరలో జాయిన్ కాబోతున్నాడు. అయితే టీజర్ ను చూసిన వారంతా తమకు కలుగుతున్న డౌట్లను క్లారీఫై చేసుకునే పనిలో పడిపోయారు.

లావిష్ టీజర్ లో జెట్ తరహా విమానాలను చూపించటంతో ఇదో సోషియో ఫాంటసీ మూవీ అని అంతా ఫీలయ్యారు. అంతేకాదు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రచారం జరగటంతో అదే ఫిక్సపోయిపోయారు కూడా. కానీ, ఇదో రెగ్యులర్ స్టోరీతో కూడుకున్న డ్రామానే అని ప్రభాస్ రివీల్ చేసేశాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇదో భారీ యాక్షన్ ఎంటైర్ టైనరే తప్ప సైంటిఫిక్ కు సంబంధించిందో.. లేక సోషియో ఫాంటసీ డ్రామానో కాదని చెప్పేశాడు.

భారీ యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే వస్తాయని చెబుతూ.. ఇదో సాదా సీదా స్టోరీనే అని తేల్చేశాడు. అయితే సినిమాలో అందించే ట్విస్టులు మాత్రం సీటు అంచున కూర్చోబెట్టడం ఖాయమన్న విషయం మాత్రం కన్ఫర్మ్ చేసేశాడు. సుజిత్ దర్శకత్వంలో తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, పలువురు బాలీవుడ్ నటీనటులు కనిపించనుండగా .. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెల్లీ బెట్స్ ఆధ్వర్యంలో ఫైట్స్ ఉండబోతున్నాయంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saaho  Prabhas  Action Entertainment  

Other Articles