ఛార్మికి ఫేవర్.. సిట్ కు కండిషన్స్ అప్లై | HC Conditions to SIT to Probe Charmi

High court verdict on charmi petition

Tollywood Drug Case, Charmi SIT Probe, SIT Probe, SIT High Court Charmi, Charmi SIT Inquiry, HC Charmi Petition, Charmi Writ Petition, Charmi Petitioon HC Orders, No Blood Samples Charmi

High Court To Pronounce Verdict Today On Charmi Petition in SIT Probe over Drug Case. No Blood Samples from Charmi HC ordered SIT.

ఛార్మి విచారణకు లైన్ క్లియర్.. కండిషన్స్ అప్లై

Posted: 07/25/2017 04:25 PM IST
High court verdict on charmi petition

సిట్ దర్యాప్తు తీరు సరిగ్గా లేదంటూ నటి చార్మి హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ తీర్పు వెలువడింది. రక్తపు సేకరణ, సమయభావం లో మాత్రమే ఛార్మికి మినహాయింపు ఇస్తూ సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్ విచారణలో తనతోపాటు న్యాయవాదిని అనుమతించాలన్న ఛార్మి విజ్నప్తికి నిరాకరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆమెను విచారించాలని, విచారణా బృందంలో మహిళను నియమించాలని ఆదేశించింది.

అయితే ఒకే రోజులో విచారణ పూర్తి కాకపోతే మరోసారి పిలవవచ్చని, విచారణ ప్రాంతాన్ని నేటి సాయంత్రం సిట్ అధికారులకు చెబుతామని హైకోర్టు పేర్కొంది. అంతకుముందు, చార్మి నిందితురాలు కాదని, సాక్షి కూడా కాదని, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం చార్మీకి ఇష్టం లేదని, ఆర్టికల్ 20 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛని కాపాడాలని ఆమె తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎక్సైజ్ సిట్ ఆఫీసు పోలీస్ స్టేషన్ లా ఉందని, చార్మి విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కోర్టులో తెలిపారు.

పైగా దర్శకుడు పూరీ జగన్నాథ్ శాంపిల్స్ తీసుకున్న విధానం సరిగ్గా లేదని, బలవంతంగా శాంపిల్స్ సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని చార్మి తరపు న్యాయవాది అన్నారు. కాగా, చార్మి ఇంటికే వస్తామని నోటీసులు ఇచ్చిన సమయంలోనే చెప్పామని, కానీ, తానే సిట్ ఆఫీస్ కు వస్తానని ఛార్మి చెప్పిందని సిట్ వాదనలు వినిపించింది. అయితే, చార్మి అనుమతిస్తే కనుక, ఇప్పుడైనా ఆమె ఇంటికి వెళ్తామని హైకోర్టులో సిట్ తెలిపింది. ఈ విషయంలో తాను సిట్ ఆఫీస్ కు వచ్చేందుకు ఎలాంటి అభ్యంతం లేదని ఛార్మీ గతంలోనే చెప్పిన విషయాన్ని ఎక్సైజ్ లాయర్ కోర్టులో ప్రస్తావించాడు కూడా. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ ఇచ్చారని, నటుడు నవదీప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సేకరించలేదని, డ్రగ్స్ డీలర్ కాల్విన్ సమాచారం ఆధారంగా నోటీసులు ఇచ్చామని హైకోర్టులో సిట్ పేర్కొంది.


చిన్నా విచారణ పూర్తి...

ఆరో రోజు సిట్ విచారణలో భాగంగా ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ప్రశ్నించిన అధికారులు త్వరగానే వదిలేశారు. తెలంగాణ సిట్ కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు చిన్నాను అధికారులు విచారించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో చిన్నాకు గల సంబంధాలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. సిట్ అడిగిన ప్రశ్నలకు చిన్నా త్వరగతినే సమాధానమివ్వటంతో విచారణ త్వరగా పూర్తయినట్లు అర్థమౌతుంది. ఇక విచారణ అనంతరం, మీడియాతో మాట్లాడకుండా చిన్నా వెళ్లిపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  SIT Probe  Actress Charmi  

Other Articles