సాహో పూర్తిగా హిందీ ప్లేవరేనా? | Saaho Cast and Crew Complete Bollywood

Bollywood actress confirmed for saaho

Prabhas, Saaho Actress, Saaho Bollywood Flavour, Saaho Bollywood Actor, Chunky Pandey Saaho, Saaho Movie, Prabhas Heroine Saaho, Saaho Heroine Official, Baahubali Hero Next Movie, Saaho Heroine

Prabhas Saaho Female Lead Hunt Continues. Another Bollywood Actor joins in this team doubts raised movie lost telugu nativity.

సాహో హీరోయిన్ స్వీటీకాదు.. బాలీవుడ్ నటేనా?

Posted: 07/24/2017 05:09 PM IST
Bollywood actress confirmed for saaho

బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడి సాహో కోసం కొత్త మేకోవర్ తో సిద్ధమైపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే బాడీ తగ్గించేసి షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు కూడా. స్టైలిష్ మేకింగ్ లో ఎలాంటి మిస్టేక్ లు దొర్లకుండా చాలా కేర్ తీసుకుంటున్నాడు యంగ్ దర్శకుడు సుజిత్. అయితే సినిమా కు వచ్చిన అసలు సమస్య మాత్రం ఇంకా తీరకపోవటం దారుణం.

చాలా సస్పెన్స్ తర్వాత అనుష్క నే ఈ సినిమాకు తీసేసుకున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఎక్కడా మేకర్ల నుంచి దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. తర్వాత సినిమా కోసం ఓ యంగ్ హీరోయిన్ ను సెలక్ట్ చేసినట్లు, కేవలం సెకండ్ లీడ్ కోసం ఆమె ఎంపిక జరిగిందని లీకులు అందటంతో, మెయిన్ లీడ్ మాత్రం అనుష్కే అని ఫిక్సయిపోయారు. ఇప్పుడు స్వీటీ రేసు నుంచి అవుట్ అయ్యిందని క్లారిటీ వచ్చేసింది.

వెయిట్ లాస్ సమస్యతోపాటు అల్రెడీ కమిట్ అయిన చిత్రాలు ఉండటంతో సాహోకు సారీ చెప్పేసిందని తెలుస్తోంది. దీంతో రేసు నుంచి అనుష్క అవుట్ అన్నది తేలిపోగా, లీడ్ హీరోయిన్ కోసం వేట మాత్రం కొనసాగుతుందన్న హింట్ ఇచ్చేశారు. 2018 లో సాహో రిలీజ్ అవుతుండగా, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ నెగటివ్ రోల్ లో ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ లో పాల్గొంటుడగా, మరో నటుడు చుంకీ పాండే కూడా ఓ కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్ శంకర్ ఎల్ హసన్ బాలీవుడ్ వాళ్లే కావటంతో సినిమా కంప్లీట్ గా హిందీ ఫ్లేవర్ తోనే నింపేస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ ను అయినా తెలుగు వాళ్లను తీసుకుంటే మంచిదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Saaho Movie  Heroine  Chunky Pandey  

Other Articles