Rare Tweet on NTR's Jai Lava Kusa Teaser

Senior director praise ntr jai teaser

Jai Lava Kusa Teaser, NTR, NTR Raghavendra Rao, Raghavendra Rao Jai Lava Kusa, Raghavendra Rao Tweet on tarak, Raghavendra Rao likes Ravana Much, Celebs tweets on Jai Lava Kusa Teaser, Celebs Praise Jai teaser, Tollywood Jai Teaser, Tollywood Likes Ravana

Tollywood Senior Director Raghavendra Rao Praises Tarak Jai Lava Kusa Teaser. He has Guts and wait to watch movie.

ఎన్టీఆర్ టీజర్.. పెద్దాయన అలా రియాక్ట్ అయ్యాడేంటి?

Posted: 07/07/2017 03:00 PM IST
Senior director praise ntr jai teaser

రిజర్వ్ గా కనిపించే దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడం చాలా అరుదు. ఒకవేళ మాట్లాడినా బాగా కావాల్సిన వాళ్ల కోసం అదీ కూడా లిమిట్ లోనే మాట్లాడేస్తుంటారు. అలాంటిది యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసల జల్లు కురిపించారు. టాలీవుడ్ మొత్తం నిన్నటి నుంచి 'జై లవకుశ' ఫీవర్ తో ఊగిపోతుంది. ఎన్టీఆర్ ను చూసి ఫిదా అయిపోతూ అంతా ట్వీట్లు కురిపించేస్తున్నారు.

ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంతో ద.ద..ద... ధైర్యం. అది మా తారక్ కు బోలెడు ఉందంటూ టీజర్ డైలాగ్ తోనే పొగడ్తలు కురిపించాడు. తారక్ ధైర్యాన్ని తెర మీద చూసేందుకు తాను ఎదురు చూస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఢిపరెంట్ మాడ్యులేషన్ తో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. జూనియ‌ర్ సన్నిహితుడు డైరక్టర్ రాజ‌మౌళి.. అంద‌రితో 'వావ్' అనిపించేలా చేస్తూ తారక్ ఎంతో అద్భుతంగా ప‌బ్లిసిటీ ప్రారంభించాడు అంటూ ట్వీటాడు.

నందమూరి సినిమాలపై రెగ్యులర్ గా స్పందించే మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా జై ల‌వ కుశ టీజ‌ర్‌పై రెస్సాండ్ అయ్యాడు. ‘జై ల‌వ‌కుశ సినిమాలోని జైని 'జ‌వాన్' సినిమాలోని జై ఆహ్వానిస్తున్నాడు’ అంటూ పనిలో పనిగా తన సినిమా ప్రమోషన్ కూడా చేసేసుకున్నాడు. దర్శకులు కొరటాల శివ, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, సంపత్ నంది, వక్కంతం వంశీ, రానా, నితిన్, హీరోయిన్లు నివేదా థామస్, మెహ్రీన్ కౌర్, సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఇలా టాలీవుడ్ మొత్తం టైగర్ టీజర్ ను పొగుడుతూ క్యూ కట్టేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Raghavendra Rao  Jai Lava Kusa Teaser  

Other Articles