Baahubali 2 box office collections in telugu states బహుపరాక్.. బాహుబలి బహుపరాక్.. తగ్గని కలెక్షన్లు

Baahubali 2 box office collections in telugu states

baahubali 2, baahubali 2 collection, baahubali 2 box office, baahubali 2 box office collection, baahubali 2 box office collection day 22, ss rajamouli, half girlfriend, hindi medium, entertainment news, tollywood, entertainment

Baahubali 2 box office collection day 22: SS Rajamouli film is piling a heap of records, a growing mountain of challenges in terms of vision and collection for all Indian movies that will release in the future.

బహుపరాక్.. బాహుబలి బహుపరాక్.. తగ్గని కలెక్షన్లు

Posted: 05/21/2017 01:18 PM IST
Baahubali 2 box office collections in telugu states

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటిన చిత్రం బాహుబలి అని చెప్పడం అతిశయెోక్తి కాదు. ఇ:దుకు కారణం విడుదలైన ప్రతి చోట 'బాహుబలి 2' తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగడమే. చిత్రం విడుదలై మూడు వారాలు కావస్తున్నా.. ఇప్పటికీ ఏమాత్రం ప్రేక్షకాధరణ తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో బాక్సాఫీసు వద్ద బాహుబలి కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతూనే వుంది. ఏరియాల వారీగా చూసుకుంటే 22 రోజుల్లో ఈ సినిమా, నైజామ్ లో 60.19 కోట్లు .. సీడెడ్ లో 31.27 కోట్లు .. ఉత్తరాంధ్రలో 23.59 కోట్లు .. గుంటూరులో 16.32 కోట్లు .. తూర్పు గోదావరిలో 15.77 కోట్లు .. పశ్చిమగోదావరిలో 11.48 కోట్లు .. కృష్ణాలో 12.77 కోట్లు .. నెల్లూరులో 6.96 కోట్లు రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కలుపుకుని 22 రోజుల్లో ఈ సినిమా 179.45 కోట్లను వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల షేర్ ను సాధించడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమా అద్భుతమైన దృశ్యాల సమాహారంగా ఉండటంతో రిపీట్ ఆడియన్స్ ఎక్కువగానే వుంటున్నారనీ, అందుకే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baahubali 2  telugu states  box office collection  ss rajamouli  tollywood  entertainment  

Other Articles