Raj Tarun Uses B.Com Physics in Andagadu

Bcom physics lyrics shift to raj tarun

Raj Tarun Andagadu, Raj Tarum Mahesh Babu, Not Mahesh babu Its Raj Tarun, B.Com Physics Song, Physics in B.Com Song, Ramajogaiah Sastry B.Com Physics Lyrics, Andagadu Aatakochadu Song, Raj Tarun Jaleel Khan

Raj Tarun refers Physics in B.Com for Hebah Patel Waist in Andagadu Song. Before this rumour spread that Mahesh Babu using same lyrics in Spyder Movie with Same Lyricist ramajogaiah sastry who write former one.

బీకాంలో ఫిజిక్స్.. మహేష్ టూ రాజ్ తరుణ్

Posted: 05/17/2017 12:13 PM IST
Bcom physics lyrics shift to raj tarun

టాలీవుడ్ లో క్యాచీ, ట్రెండింగ్ పదాల వాడకం అప్పుడెప్పుడో పూరీ జగన్నాథ్ మొదలుపెట్టగా, ఇప్పుడొస్తున్న కుర్ర దర్శకులు కూడా అదే కొనసాగిస్తున్నారు. ఏదైనా బాగా వైరల్ అయిన టాపిక్ ను ఇలా టైటిళ్లుగా, లేక సినిమాలో ఏదో ఒక రూపకంలో పెట్టడం ద్వారా సినిమాకు అదనపు ఆకర్షణ తెచ్చేస్తున్నారు.

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాం ఫిజిక్స్ కూడా ఇలాంటి బాపతు వ్యవహారమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే బాగా వైరల్ అయిన ఈ పదాన్ని సినిమాల్లో కూడా వాడేసేందుకు సిద్ధం అయిపోయారు. మొన్నా మధ్య మహేష్ మురగదాస్ సినిమాలో పాటలో లిరిక్స్ కింద ఈ లైన్ ను వాడేయాలని సిద్ధం అయినట్లు చెప్పుకున్నాం. కానీ, తర్వాత అదంతా ట్రాష్ అని స్వయంగా గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి చెప్పటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యారు. అలా లిరిక్స్ తో సమస్యలు తెచ్చుకోవటం ఎందుకని భావించిన మహేష్ కూడా వద్దనే చెప్పాడన్న మరో టాక్ కూడా ఉంది.

 

అయితే ఎలాగోలా ఆ లైన్ ను పాటలో ఇరికించేయాలనుకున్నారేమో మరో సినిమా కోసం ఆ పని చేసేశారు. రాజ్ తరుణ్ హెబ్బా పటేల్ జంటగా నటించిన అంధగాడు త్వరలో రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇందులో అందగాడు ఆటకొచ్చాడే అంటూ సాగే పాటలో ... బీకామ్ లో ఫిజిక్స్ లాగా.. నీ నడుమెక్కడే నాజుకూ తీగ.. అంటూ సాహిత్యం ఇచ్చేశాడు సేమ్ అదే రామజోగయ్య శాస్త్రి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andagadu Movie  Raj Tarun  B.Com lo Physics Song  

Other Articles