పక్కా లోకల్ లుంగీ.. థాట్ ఎవరిదంటే... | Ram Charan's Lungi Dance for Sukumar Movie.

Ram charan complete lungi avatar for sukumar movie

Ram Charan Sukumar Movie, Ram Charan Lungi Dance, Cherry Sukku Special Costumes, Ram Charan 11 Movie, RC 11 Movie, RC 11 Director, Ram Charan Mass Getup, Samantha look in Ram Charan Movie

No Special Costumes to Ram Charan for Sukumar Movie. Mega Power Star completely appears with Lungi in Oora Mass Getup.

చెర్రీ-సుక్కూ... మొత్తం లుంగీ డాన్సేనంట

Posted: 04/11/2017 11:58 AM IST
Ram charan complete lungi avatar for sukumar movie

సుకుమార్ తో రొమాంటిక్ పీరియడ్ డ్రామాను మొదలుపెట్టేశాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఫస్ట్ లుక్ లో లుంగీతోనే కావటి మోస్తున్నట్లు వెనకాల నుంచి ఓ పోస్టర్ ను వదిలగా, రీసెంట్ గా లుంగీ, బనియన్ తో ఉన్న చెర్రీ షూటింగ్ మొదలైందంటూ ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా మెగా హీరోలంతా పంచెలతో సందడి చేస్తుంటే... చెర్రీ మాత్రం ఊర మాస్ లుంగీ గెటప్ లోనే కనిపించబోతున్నాడని ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

మాములుగా అయితే తన సినిమాల కాస్టూమ్ కోసం బ్యాంకాక్, దుబాయ్ లేదా లండన్ వెళ్లి అక్కడ ఇంటర్నేషనల్ డిజైనర్లు రూపొందించిన వాటికి ప్రాధాన్యత ఇచ్చే చెర్రీ ఇప్పుడు మాత్రం ఆ పని చేయడటం లేదంట. కథకు, పాటలకు సంబంధించిన వరకు ఎక్కడా కూడా మోడ్రన్ టచ్ చూపించాల్సిన అవసరం లేదు. అందుకే వీలైనంత వరకు రియలిస్టిక్ గానే ఉండేలా సుక్కూ కూడా కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక కంప్లీట్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత వేషాధారణ కూడా చాలా ఢిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి చెర్రీ లుంగీ డాన్స్ ఐడియా క్రెడిట్ మొత్తం సుకుమార్ ఖాతాలోకే వెళ్లిపోబోతుంది. 55 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైభవ్, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Sukumar Movie  Lungi Costumes  

Other Articles